ఫ్లిప్‌కార్ట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌ 2026.. ఈ స్మార్ట్‌ఫోన్‌లపై బెస్ట్‌

ఫ్లిప్‌కార్ట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌ జనవరి 17 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ బ్లాక్‌, ప్లస్‌ మెంబర్లు 24 గంటల ముందుగానే సేల్‌లో పాల్గొనేందుకు అవకాశం ఉంది.

ఈ సేల్‌లో భాగంగా HDFC బ్యాంకు కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్‌ స్మార్ట్‌ఫోన్‌ డీల్స్‌ వివరాలు వెల్లడయ్యాయి.


శాంసంగ్ :

ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో భాగంగా శాంసంగ్‌ గెలాక్సీ A35 5G స్మార్ట్‌ఫోన్‌ను (Samsung Galaxy A35 5G Smartphone) భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చని తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ లిస్టింగ్‌ ఆధారంగా 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.18499 కే అందుబాటులోకి వస్తుంది.

రియల్‌మి :

రియల్‌మి P3 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.22999 కే అందుబాటులోకి ఉంటుంది. 6.83 అంగుళాల 1.5K క్వాడ్ కర్వడ్‌ OLED డిస్‌ప్లే, మీడియాటెక్‌ డైమెన్సిటీ 8350 అల్ట్రా చిప్‌, ఆండ్రాయిడ్‌ 15 OS పైన పనిచేస్తుంది. 50MP OIS + 8MP + 16MP సెల్ఫీ కెమెరాలున్నాయి. 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

వివో :

ఫ్లిప్‌కార్ట్‌ రిపబ్లిక్ డే సేల్‌ 2026 భాగంగా వివో T4 సిరీస్ ఫోన్‌పై డిస్కౌంట్‌ను పొందవచ్చు. వివో T4x ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.14999 కే కొనుగోలు చేయవచ్చు. వివో T4 స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.20999 ధరకే సొంతం చేసుకోవచ్చు.

అదే వివో T4 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ ను రూ.24999 కే సొంతం చేసుకోవచ్చు. అదే అల్ట్రా వేరియంట్‌ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ను రూ.32999 ధరకు అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. అయితే అల్ట్రా మోడల్‌ ఫోన్ సగం ధరకు అందుబాటులోకి వస్తుందని ఇటీవల లీక్స్‌ వచ్చాయి.

పోకో M7 ప్లస్ :

పోకో M7 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ గత సంవత్సరం విడుదల అయింది. ఫ్లిప్‌కార్ట్‌ లిస్టింగ్‌ ఆధారంగా ఈ ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.12999 ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 6.9 అంగుళాల భారీ డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. స్నాప్‌డ్రాగన్ 6s జెన్‌ 3 చిప్‌, ఆండ్రాయిడ్‌ 15 OS పైన పనిచేస్తోంది. 50MP ప్రైమరీ, 8MP సెల్ఫీ కెమెరాలున్నాయి.

AI+ నుంచి గత సంవత్సరం రెండు స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో AI+ పల్స్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.6499 కే కొనుగోలు చేయవచ్చని చెబుతోంది. అదే AI+ నోవా 6GB + 128GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.7499 కే సొంతం చేసుకోవచ్చు.

ఈ సేల్‌లో భాగంగా గూగుల్‌ పిక్సల్ 10 స్మార్ట్‌ఫోన్‌ 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్ ను రూ.64999 కే కొనుగోలు చేయవచ్చు. లిస్టింగ్‌ ఆధారంగా ఈ వివరాలు వెల్లడయ్యాయి. దీంతోపాటు ఐఫోన్ 16, 17 మోడల్స్ పైనా డిస్కౌంట్‌లను పొందవచ్చు. ఐఫోన్‌ ఎయిర్‌ మోడల్‌ను రూ.93900 ధరకు అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.