భారతదేశంలో పెట్టుబడిదారులు నమ్మకమైన పెట్టుబడి సాధనం ఎఫ్‌డీలు నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో పెరిగిన ఆర్థిక అక్షర్యాసత నేపథ్యంలో ఇటీవల ఎఫ్‌డీల్లో పెట్టుబడి తగ్గాయి.
ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల బ్యాంకులు తమ కోర్ బ్యాంకింగ్ కార్యకలాపాలపై దృష్టి పెట్టాలని కోరారు. డిపాజిట్, రుణాలు. డిపాజిట్లను పెంచడానికి వినూత్న ఆఫర్లను తీసుకురావాలని ఆమె రుణదాతలను కోరింది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కూడా డిపాజిట్లను పెంచడానికి బ్యాంకులు తమ వడ్డీ రేట్లను నిర్ణయించుకునే స్వేచ్ఛను కలిగి ఉన్నాయని చెప్పారు. ఈ పరిస్థితుల దృష్ట్యా బ్యాంకులు డిపాజిట్లను ఆకర్షించడానికి వాటి వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారతదేశంలో టాప్ బ్యాంకులైన హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐసీ, ఎస్‌బీఐ బ్యాంకుల్లో ఎఫ్‌డీల్లో వడ్డీ రేట్లను తెలుసుకుందాం.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వడ్డీ రేట్లు
7 రోజుల నుంచి 29 రోజుల వరకు సాధారణ ప్రజలకు 3.00 శాతం, సీనియర్ సిటిజన్లకు – 3.50 శాతం
30 రోజుల నుంచి 45 రోజుల వరకు సాధారణ ప్రజలకు 3.50 శాత, సీనియర్ సిటిజన్లకు – 4.00 శాతం
46 రోజుల నుంచి ఆరు నెలల వరకు సాధారణ ప్రజలకు 4.50 శాతం, సీనియర్ సిటిజన్లకు – 5.00 శాతం
6 నెలల నుంచి 9 నెలల కంటే తక్కువ సమయానికి సాధారణ ప్రజలకు, 5.75 శాతం; సీనియర్ సిటిజన్లకు 6.25 శాతం
1 సంవత్సరం నుంచి 15 నెలల కంటే తక్కువ సమయానికి సాధారణ ప్రజలకు 6.60 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.10 శాతం
15 నెలల నుంచి 18 నెలల కంటే తక్కువ సమయానికి సాధారణ ప్రజలకు 7.10 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం
18 నెలల నుంచి 21 నెలల కంటే తక్కువ సమయానికి సాధారణ ప్రజలకు 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం
21 నెలల నుంచి 2 సంవత్సరాల తక్కువ వరకు వరకు సాధారణ ప్రజలకు 7.00 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం
2 సంవత్సరాల 11 నెలల నుంచి 35 నెలల వరకు సాధారణ ప్రజలకు 7.35 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7.85 శాతం
ఎస్‌బీఐ వడ్డీరేట్లు
ఏడు రోజుల నుంచి 45 రోజుల వరకు సాధారణ ప్రజలకు 3.50 శాతం, సీనియర్ సిటిజన్లకు – 4.00 శాతం
46 రోజుల నుంచి 179 రోజులు వరకు సాధారణ ప్రజలక 5.50 శాతం, సీనియర్ సిటిజన్లకు – 6.00 శాతం
180 రోజుల నుంచి 210 రోజుల వరకు సాధారణ ప్రజలకు – 6.25 శాతం సీనియర్ సిటిజన్లకు – 6.75 శాతం
211 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ సమయానికి సాధారణ ప్రజలకు 6.50 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7.00 శాతం
1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ సమయానికి సాధారణ ప్రజలకు 6.80 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7.30 శాతం
2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువ సమయానికి సాధారణ ప్రజలకు 7.00 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7.50 శాతం
ఐసీఐసీఐ బ్యాంక్ తాజా వడ్డీ రేట్లు
ఏడు రోజుల నుంచి 29 రోజుల వరకు సాధారణ ప్రజలకు 3.00 శాతం, సీనియర్ సిటిజన్లకు – 3.50 శాతం
30 రోజుల నుంచి 45 రోజుల వరకు సాధారణ ప్రజలకు 3.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.00 శాతం
46 రోజుల నుంచి 60 రోజుల వరకు సాధారణ ప్రజలకు 4.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.75 శాతం
61 రోజుల నుంచి 90 రోజుల వరకు సాధారణ ప్రజలకు 4.50 శాతం; సీనియర్ సిటిజన్లకు – 5.00 శాతం
91 రోజుల నుంచి 184 రోజుల వరకు సాధారణ ప్రజలకు 4.75 శాతం, సీనియర్ సిటిజన్లకు – 5.25 శాతం
185 రోజుల నుంచి 270 రోజుల వరకు సాధారణ ప్రజలకు 5.75 శాతం, సీనియర్ సిటిజన్లకు – 6.25 శాతం
271 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ సమయానికి సాధారణ ప్రజలకు 6.00 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.50 శాతం
ఒక సంవత్సరం నుంచి 15 నెలల కంటే తక్కువ సమయానికి సాధారణ ప్రజలకు 6.70 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.20 శాతం
15 నెలల నుంచి 18 నెలల కంటే తక్కువ సమయానికి సాధారణ ప్రజలకు 7.25 శాతం సీనియర్ సిటిజన్లకు 7.80 శాతం
18 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు సాధారణ ప్రజలకు 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం
2 సంవత్సరాల 1 రోజు నుంచి 5 సంవత్సరాల వరకు సాధారణ ప్రజలకు 7.00 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం