షుగర్ ఉన్నవారికి గుడ్ న్యూస్.. ఇక నుండి ఈ ఆహారాలపై ఫోకస్ చేయండి..! ఇవి షుగర్ లెవెల్స్ ను తగ్గిస్తాయి.

గ్లూకోజ్ లెవెల్స్ సమతుల్యంగా ఉండటం చాలా ఇంపార్టెంట్. అవి ఎక్కువైనా, తక్కువైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు ఈ లెవెల్స్‌ను ఎప్పుడూ చెక్ చేస్తూ సరైన ఫుడ్ తీసుకోవడం అవసరం.


రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేసే ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆకుకూరలు

పాలకూర, బచ్చలికూర లాంటి ఆకుకూరల్లో తక్కువ కార్బ్స్, ఎక్కువ విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఇవి బ్లడ్‌లో షుగర్‌ను కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తాయి.

బెర్రీ ఫ్రూట్స్

స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, రాస్ప్బెర్రీస్ లాంటి ఫ్రూట్స్‌లో ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి.

హెల్తీ నట్స్

ఆల్మండ్స్, వాల్‌నట్స్, చియా సీడ్స్‌లో ప్రోటీన్, ఫైబర్, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి బ్లడ్‌లో షుగర్ త్వరగా కలవకుండా స్లోగా జరిగేలా చేస్తాయి. దీని వల్ల గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి.

తృణధాన్యాలు

క్వినోవా, ఓట్స్, బ్రౌన్ రైస్ లాంటి తృణధాన్యాల్లో కాంప్లెక్స్ కార్బ్స్, ఫైబర్ ఉంటాయి. ఇవి బ్లడ్‌లో షుగర్ లెవెల్స్‌ను బ్యాలెన్స్ చేస్తాయి.

కాయధాన్యాలు, బీన్స్

చిక్కుళ్లు, పెసలు, శనగలు లాంటి కాయధాన్యాల్లో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండి, బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి.

ఫ్యాటీ ఫిష్

సాల్మన్, మాకెరెల్ లాంటి చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బాడీలో ఇన్సులిన్ రియాక్షన్‌ను మెరుగుపరచడానికి హెల్ప్ చేస్తాయి.

పెరుగు

పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్, ప్రోటీన్ గట్ హెల్త్‌ను ఇంప్రూవ్ చేయడంతో పాటు గ్లూకోజ్ లెవెల్స్‌ను కూడా బ్యాలెన్స్ చేస్తాయి.

దాల్చిన చెక్క

ఫుడ్‌లో కొద్దిగా దాల్చిన చెక్క పౌడర్ యాడ్ చేయడం వల్ల బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ కొంతవరకు తగ్గుతాయని రీసెర్చ్‌లలో తేలింది.

దుంపలు

క్యారెట్లు లాంటి దుంపలలో ఫైబర్, విటమిన్స్ ఉంటాయి. ఇవి కూడా గ్లూకోజ్ బ్యాలెన్స్ అయ్యేలా చేస్తాయి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.