వర్షాకాలంలో ఇంట్లో ఈగల మోత.. ఉపశమనం కోసం.. సింపుల్ టిప్స్ పాటించి చూడండి

www.mannamweb.com


వర్షాకాలంలో వాతావరణం తేమగా ఉంటుంది. దీంతో దోమలు, ఈగలు వాటి వాటికి నిలయంగా మారుతుంది ఈ వాతావరణం. రాత్రి దోమలతో .. పగలు ఈగలతో విసిగిపోవాల్సిందే.

ఈగల సమస్య నగరం, పల్లె అనే తేడా లేకుండా అన్ని చోట్లా ఉంటుంది. దీంతో ఇంటిని ఫినైల్‌తో తుడిచినా..ఈగలు రాకుండా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా అవి వెళ్ళినట్లు వెళ్లి తిరిగి వస్తాయి. ఈగలు సందడి చేస్తూ చేసే సౌండ్ చాలా మందికి అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అంతేకాదు ఈగలు ఎక్కువగా సంచరిస్తే వ్యాధులు ప్రబలే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే ఈగలు మురికి మీద వాలి.. మళ్ళీ తినే ఆహారం మీద వాలతాయి. అప్పుడు ఆహారం కలుషితమయ్యి అనేక రకాల వ్యాధుల బారిన పడే ప్రమాదాన్ని పెంచుతుంది. ఆ ఆహారాన్ని తినడం వల్ల రకరకాల వ్యాధులు వస్తాయి. వర్షాకాలంలో కొన్ని దేశీయ పద్ధతులను అవలంబిస్తే.. ఈగల నుంచి ఉపశమనం కలుగుతుంది.

ఒక గిన్నె తీసుకుని నీరు వేసి అందులో రాక్ సాల్ట్ వేసి ఆ నీటిని బాగా మరిగించండి. ఇప్పుడు ఈ నీటిని స్ప్రే చేసే విధంగా ఒక సీసాలో పోసి.. వంటగదిలోని ప్రతి మూలలో ఈ నీటిని స్ప్రే చేయండి. ఉప్పు-నీటి స్ప్రేని ఈగలు తట్టుకోలేవు. అప్పుడు ఇంట్లో ఈగలు రావడం తగ్గుతుంది.
ఈగలను తరిమికొట్టడానికి ఒక గ్లాసు పాలలో కొంచెం మిరియాలు, పంచదార వేసి కాసేపు మరిగించి.. ఆ మిశ్రమాన్ని వంటగదిలో ఒక మూలలో ఉంచండి. ఈ పాల మిశ్రమం దగ్గరకు ఈగలు చేరుకుంటాయి. దీంతో వంటగదిలో ఈగల సంఖ్య తగ్గుతుంది.
ఈగలను తరిమేయడానికి పేపర్ టవల్స్ ను ఉపయోగించవచ్చు. ఏదైనా ద్రవాన్ని ఒక కుండలో లేదా జాడీలో ఉంచి దాని నోటిపై పేపర్ టవల్‌ను ఉంచడం వల్ల ఈగల ఉధృతి తగ్గుతుంది.
ఈగలను నివారించడానికి వెనిగర్‌ ఉపయోగపడుతుంది. వెనిగర్ వాసనకు ఈగలు ఆకర్షితులవుతాయి. ఒక గిన్నెలో కొంచెం వెనిగర్ తీసుకుని.. గిన్నెను ప్లాస్టిక్‌ కవర్ తో చుట్టండి. ఈగలు లోపలికి ప్రవేశించడానికి కవర్ కు చిన్న రంధ్రాలు చేయండి.. అప్పుడు ఆ కవర్ లోకి ఈగలు వెళ్ళిన తర్వాత కవర్ చేస్తే ఈగలు బయటకు రాలేవు. తద్వారా ఈగల సంఖ్య తగ్గుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)