మారుతీ సుజుకీ రూపొందించిన ఫ్రాంక్స్ (Fronx) కారు ఇప్పుడు కేవలం భారతీయ మార్కెట్‌కే పరిమితం కాకుండా, అంతర్జాతీయంగా కూడా తన సత్తా చాటుతోంది. ఓ ప్రముఖ SUVగా అవతరించిన ఈ ఫ్రాంక్స్ కారు, బలమైన డిజైన్, లేటెస్ట్ ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటుంది.
భారతదేశంలో ఇప్పటికే ఈ కారు వందల సంఖ్యలో అమ్ముడవుతోంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇదే SUVని సుజుకి మోటార్ కార్పొరేషన్ మారుతీ సుజుకీ మాతృసంస్థ ఇప్పుడు జపాన్ మార్కెట్లో కూడా ఈ కారును విక్రయిస్తోంది. అక్కడ కూడా ఈ కారు మంచి ఆదరణ పొందుతూ పెద్ద సంఖ్యలో అమ్ముడవుతోంది. ఇది కేవలం అమ్మకాలు మాత్రమే కాదు, ఫ్రాంక్స్ ఇప్పుడు సేఫ్టీ పరంగా కూడా అద్బుతమైన కారుగా నిలిచింది.
తాజాగా అక్కడ నిర్వహించిన క్రాష్ టెస్టుల్లో ఈ SUV అద్భుతమైన స్కోర్లు సాధించి, అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో చోటు సంపాదించింది. ఈ ఫలితాలు చూసి జపాన్ కస్టమర్లు విశ్వాసంతో ఈ కారును ఎంచుకుంటున్నారు. జపాన్‌లో నిర్వహించిన NCAP (New Car Assessment Program) క్రాష్ టెస్ట్‌లో ఈ కారు 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ అందుకొని, అంతర్జాతీయ స్థాయిలో భారత తయారీకి గర్వకారణంగా నిలిచింది.
డ్రైవర్, ప్రయాణికుల రక్షణ, బాంపర్ ముడకలు, ఎయిర్‌బ్యాగ్ స్పందన, పిల్లల రక్షణ, వాహనం స్టెబిలిటీ సిస్టంలు మొదలైనవి. ఈ విభాగాల్లో ఫ్రాంక్స్ SUV 193.8లో 163.75 పాయింట్లను సాధించడం గమనార్హం. జపాన్ వంటి కఠినమైన భద్రతా ప్రమాణాలు ఉన్న దేశంలో భారతదేశంలో తయారైన కారు ఈ స్థాయి రేటింగ్‌ను పొందడం నిజంగా ప్రాముఖ్యత కలిగిన విషయం. ఇది ఖచ్చితంగా ఈ కారు భద్రతపై ఉన్న నిబద్ధతను చూపుతుంది.
మేడ్ ఇన్ ఇండియాగా తయారైన కార్లు జపాన్ సేఫ్టీ ప్రమాణాలకు అనుగుణంగా ఉండటం విశేషం. ఇప్పటికే ఫ్రాంక్స్‌కు అక్కడి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీని ఆకట్టుకునే డిజైన్, ఫీచర్స్ ఇతర అంశాలు అన్ని కూడా అక్కడి వారిని బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ప్రమాద సమయంలో అత్యుత్తమ సేఫ్టీ అందించగలదు అని నిరూపితం కావడంతో రానున్న రోజుల్లో ఈ కారు కోసం షోరూమ్ జనాలు బారులు తీరే అవకాశం ఉంది.
క్రాష్ టెస్ట్ ప్రకారం, ఫ్రాంక్స్, ఢీకొనడానికి ముందు డ్రైవర్‌కు అందించే రక్షణ పరీక్షల్లో 85.8లో 79.42 పాయింట్లు సాధించింది. ఇదే విధంగా, కారు ఢీకొనబోతున్నప్పుడు దానిని గుర్తించి నివారించగల సామర్థ్యాన్ని పరీక్షించిన సమయంలో 100లో 76.33 పాయింట్లను దక్కించుకుంది. రోడ్డుపై పాదచారుల రక్షణ విషయంలో, ఫ్రాంక్స్ ప్రత్యేకంగా రూపొందించబడిన SUV అని నిరూపించుకుంది. ప్రమాద సమయంలో పాదచారుల కాళ్లకు అధిక రక్షణ కల్పించిందనే కారణంగా పూర్తి మార్కులు పొందింది.
అదే విధంగా, పక్క వైపు నుండి ఢీకొన్నప్పుడు డ్రైవర్‌కు అందించే రక్షణ విషయంలో మంచి మార్కులు దక్కాయి. ముఖ్యంగా, కారు లేన్ నుంచి తిప్పబడినప్పుడు దానిని గుర్తించి డ్రైవింగ్‌ని క్రమబద్ధంగా ఉంచే సిస్టమ్‌కు జపాన్ NCAP అధిక మార్కులు ఇచ్చింది. అలాగే, ఢీకొనబోయే పరిస్థితుల్లో ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్ పనిచేసే విధానం, ఫ్రంటల్ కాషన్ సమయంలో డ్రైవర్‌కు అందించే రక్షణ కూడా అత్యుత్తమంగా ఉందని టెస్ట్ నివేదికలు స్పష్టం చేశాయి.
అయితే, ఫ్రాంక్స్ SUVకి పూర్తి 5-స్టార్ రేటింగ్ అందకుండా ఉండటానికి ప్రధాన కారణం, రెండు కీలక అంశాల్లో పనితీరు కొంత తక్కువగా ఉండటమే. ఒకటి – వాహనం ముందు వైపున ఢీకొనబోయే ప్రమాదంలో వెనుక సీటులో ఉన్న ప్రయాణికులకు అందించే రక్షణ. మరొకటి, ప్రమాద సమయంలో పాదచారుల తల భాగానికి సరైన రక్షణ అందించలేకపోవడం. ఈ రెండు అంశాల్లో కనిపించిన లోటులు, సుజుకి ఫ్రాంక్స్‌ను 4-స్టార్ రేటింగ్‌కి పరిమితం చేశాయి.
































