ఏపీలో మహిళలకు ఫ్రీ బస్సు.. వారికి మాత్రమే గుడ్ న్యూస్

www.mannamweb.com


ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం మరో హామీని నెరవేర్చేందుకు సిద్దమయింది. సంక్రాంతి సందర్భంగా ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పనున్నారు.

ఏపీలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్నిఅమలు చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిఆరు నెలలవుతుండటంతో మహిళలకు మరో వరాన్ని ప్రకటించడానికి సిద్ధమయింది. ఇప్పటికే పింఛన్లను నాలుగు వేల రూపాయలకు పెంచుతూ వాటిని పంపిణీ చేస్తుంది. అలాగే లక్షలాది మంది మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించింది. గత నవంబరు నెలలో వచ్చిన దీపావళి నుంచి ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు.

ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని…

ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది.2027లో జమిలి ఎన్నికలు వస్తాయన్న ప్రచారంతో అత్యంత వేగంగా హామీలను అమలు పర్చాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలవుతున్న ఉచిత బస్సు ప్రయాణంపై ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులు అథ్యయనం చేసి వచ్చి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి కూడా నెలలు గడుస్తుంది. దీనిని అమలుచేయడానికి నెలకు నాలుగు వందల కోట్లకు పైగానే అవసరం ఉంటుందని ప్రాధమికంగా అంచనా వేశారు. అయితే ఇది కూడా దాటుతుందని భావిస్తున్నారు. తక్కువ జనాభా ఉన్న తెలంగాణలోనే నాలుగు వందల కోట్లు అవుతుంటే ఇక ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలంటే కనీసం నెలకు ఐదు వందల కోట్ల రూపాయలు ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందన్న లెక్కలు కూడా వినిపిస్తున్నాయి.

అధిక వ్యయంతో పాటు…

అయితే హైదరాబాద్ నగరంలో ఎక్కువ మంది ఉచితబస్సు సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ, విశాఖ, తిరుపతి వంటి నగరాల్లో మాత్రమే సిటీ బస్సుల్లో తాకిడి ఉంటుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జనాభా కూడా ఎక్కువ కావడంతో ఏపీలో ఎక్కువ ఖర్చు అవుతుందని భావిస్తున్నారు.ఎక్కువ బస్సులు కూడా అవసరమవుతాయని అధికారులు నివేదికలో తెలిపారు. కొత్త బస్సులను కొనుగోలు చేయడం ఇప్పుడు ప్రభుత్వం ముందు ఛాలెంజ్ అని చెప్పాలి. కానీ ఇచ్చిన ప్రధాన హామీని అమలుచేయాలంటే ఆ మాత్రం రిస్క్ తీసుకోక తప్పదు. ఇటీవల మహిళల ఉచిత బస్సు పథకంపై గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చేసిన ట్వీట్ కూడా సంక్రాంతి నుంచి ఈ పథకం ప్రారంభమవుతుందని చెప్పకనే తెలుస్తుంది. వచ్చే సంక్రాంతి నుంచిమహిళలకు ఫ్రీ జర్నీఉంటుందని,ఇందుకోసం ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తుందని యార్లగడ్డ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. అయితే ఆటో డ్రైవర్లు నష్టపోకుండా ప్రభుత్వం తగిన విధివిధానాలను రూపొందిస్తుందని చెబుతున్నారు. మరి ఆర్టీసీ బస్సుల్లో కూడా తెలుపు రంగు రేషన్ కార్డు ఉన్న మహిళలకే ఉచిత ప్రయాణం కల్పిస్తారా? అన్న చర్చమాత్రం ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.