Free Gas : ఉచిత గ్యాస్ సిలిండర్.. రెండు రోజులే అవకాశం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంక్షేమ పథకమైన దీపం-2 లో భాగంగా రెండవ విడత ఉచిత గ్యాస్ (Free Gas) సిలిండర్ బుకింగ్ జులై 31తో ముగియనుంది. ప్రభుత్వం అందజేసిన షెడ్యూల్ ప్రకారం, లబ్ధిదారులు ఈ గడువు లోపే సిలిండర్‌ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.


ఒకసారి గడువు దాటిన తర్వాత అదే విడత కింద సిలిండర్ బుకింగ్ అవకాశం ఉండదని అధికారులు స్పష్టం చేశారు.

మూడవ విడతకు సిద్ధంగా ఉండండి

రెండవ విడత ముగిసిన వెంటనే మూడవ విడత పథకం ప్రారంభం కానుంది. ఆగస్టు 1 నుంచి నవంబర్ 30వ తేదీ లోపు లబ్ధిదారులు మూడవ విడత ఉచిత గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చు. గ్యాస్ బుకింగ్ చేసిన తర్వాత 48 గంటలలోపు సంబంధిత లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం రాయితీ అమౌంట్‌ను నేరుగా జమ చేస్తోంది. ఈ ప్రక్రియ వేగంగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు చేపట్టారు.

బ్యాంక్ వివరాలు అప్డేట్ చేసుకోవాలి

అయితే ప్రభుత్వం గుర్తించిన సమస్యలలో ఒకటి, కొంతమంది లబ్ధిదారుల బ్యాంక్ వివరాలు తప్పుగా ఉండటం వల్ల రాయితీ డబ్బు జమ కాకపోవడమే. ఇప్పటివరకు దాదాపు 86,000 మందికి ఈ కారణంగా సబ్సిడీ జమ కాలేదని అధికారులు వెల్లడించారు. అందువల్ల లబ్ధిదారులు తక్షణమే తమ బ్యాంక్ వివరాలను అప్డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. సబ్సిడీ మంజూరుకు ఈ ప్రక్రియ చాలా కీలకమని అధికారులు హెచ్చరిస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.