రాత్రి వేళ మహిళలకు పోలీసు వాహనాల్లో ఫ్రీ జర్నీ నిజమేనా

www.mannamweb.com


సోషల్ మీడియా వినియోగం విసృతంగా పెరిగింది. ఎక్కడ.. ఏం జరిగినా క్షణాల్లో వైరల్ అవుతోంది. కొంతమంది కావాలనే ఫేక్ న్యూస్ కూడా వైరల్ చేస్తున్నారు. అది తప్పో, రైటో కూడా నిర్ధారించుకోకుండా..

చాలామంది షేర్స్ చేస్తున్నారు. దీంతో ప్రజల్లో కన్‌ఫ్యూజన్ నెలకుంటుంది. కొన్నిసార్లు వైరల్ అవుతున్నది ఫేక్ న్యూస్ అని ప్రభుత్వాలు, పోలీసులు.. క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. తాజాగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో మహిళలు ప్రయాణం చేయాల్సి వస్తే… పోలీసులకు ఫోన్‌ చేస్తే ఉచితంగా దింపుతారంటూ ఓ వార్త ఇటీవల తెగ సర్కులేట్ అవుతోంది. 1091, 7837018555 నంబర్స్‌కు కాల్ చేస్తే… లోకల్ పోలీసుల వాహనం వచ్చి వారిని గమ్యస్థానాలకు చేరుస్తుంది అనేది అందులోని సారాంశం. అది నిజమో, కాదో తెలుసుకోకుండా కొందరు ఆయా నంబర్స్‌కు కాల్స్ చేస్తున్నారు కూడా. దీంతో హైదరాబాద్‌ పోలీసులు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

రాత్రి వేళల్లో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం పేరిట వైరల్ అవుతోన్న ఫేక్ అని హైదరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. ఇలాంటివి ఎవరూ నమ్మవద్దని సూచించారు. తప్పుడు ప్రచారం చేసేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందుకే ఇలాంటి ఎప్పుడైనా మీ దృష్టికి వస్తే.. మెయిన్ స్ట్రీమ్ మీడియా లేదా ఆయా సంస్థల అధికారిక వెబ్‌సైట్స్‌ను సంపద్రించి నిర్ధారించుకోండి.