రైలు ప్రయాణికులకు భారీ శుభవార్త.. ఇక నుంచి ఈ ఛార్జీలు ఉండవు.. మీ డబ్బులు ఆదా..

ఈ కొత్త రైల్వే నిర్ణయం లక్షలాది ప్రయాణికులకు పెద్ద ఊరటనిస్తుందనడంలో సందేహం లేదు. ఇకపై ప్లాన్‌ మారినా టెన్షన్‌ లేదు.


రైలు టికెట్‌ బుక్‌ చేసిన తర్వాత మీ ప్రయాణ తేదీ మారిందా? ఇక టికెట్‌ రద్దు చేసి, క్యాన్సిలేషన్‌ ఛార్జీలు చెల్లించే తిప్పలు అవసరం లేదు. భారతీయ రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త నియమాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ఈ నూతన సౌకర్యం 2026 జనవరి నుంచి అమల్లోకి రానుంది. దీని ద్వారా కన్ఫర్మ్‌ అయిన రైలు టికెట్‌ తేదీని ప్రయాణికులు ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా మార్చుకునే వీలుంటుంది.

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ మాట్లాడుతూ, “ఈ కొత్త పాలసీ ద్వారా ప్రయాణికులకు మరింత సౌలభ్యం కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నాం” అన్నారు. ఇప్పటివరకు ఎవరికైనా తమ ప్రయాణాన్ని వాయిదా వేయాల్సి వస్తే టికెట్‌ రద్దు చేసి క్యాన్సిలేషన్‌ ఛార్జీ చెల్లించాల్సి వచ్చేది. కానీ కొత్త సిస్టమ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత ఆ ఇబ్బంది ఉండదు. ప్రయాణికులు సులభంగా తమ ప్రయాణ తేదీని మార్చుకోవచ్చు.

ఎలా పనిచేస్తుంది ఈ సౌకర్యం? ఈ కొత్త వ్యవస్థ ప్రకారం, టికెట్‌ మార్చుకునే అవకాశం కేవలం కన్ఫర్మ్‌ టికెట్లకే వర్తిస్తుంది. అంటే వేటింగ్‌ లిస్ట్‌ లేదా RAC టికెట్లపై ఈ సౌకర్యం ఇప్పటికి అందుబాటులో ఉండదు. అలాగే కొత్త తేదీకి సీట్లు ఖాళీగా ఉన్నప్పుడే మార్పు చేయవచ్చు. కొత్త టికెట్‌ ధర పాతదానికంటే ఎక్కువైతే ఆ తేడా మొత్తాన్ని ప్రయాణికుడు చెల్లించాలి. కానీ కొత్త టికెట్‌ ధర అదే లేదా తక్కువైతే ఎలాంటి అదనపు చార్జీలు అవసరం లేదు. అంటే, టికెట్‌ రద్దు చేయకుండానే మీ ప్రయాణాన్ని సులభంగా రీషెడ్యూల్‌ చేసుకోవచ్చు.

ఇప్పటివరకు టికెట్‌ రద్దు చేసుకుంటే బేస్‌ ఫేర్‌ లో 25 నుంచి 50 శాతం వరకు క్యాన్సిలేషన్‌ ఛార్జీలు వసూలు చేసేవారు. ఈ కొత్త సౌకర్యంతో ఆ భారాన్ని రైల్వే పూర్తిగా తొలగించబోతోంది. ఇప్పుడు కేవలం తేదీ మార్చడం ద్వారా మీరు ఎలాంటి నష్టం లేకుండా మీ యాత్ర కొనసాగించవచ్చు.

ఈ నిర్ణయం ముఖ్యంగా చివరి నిమిషంలో ప్రయాణ ప్లాన్‌ మారిపోయే వారికి ఎంతో ఉపయోగపడనుంది. ఉద్యోగ, వ్యాపార లేదా కుటుంబ కారణాల వల్ల ప్రయాణం వాయిదా వేసుకునే వారు ఇక కొత్త టికెట్‌ కొనాల్సిన అవసరం లేకుండా సులభంగా తేదీ మార్చుకోవచ్చు.

రైల్వేలో డిజిటల్‌ మార్పులు: రైల్వే వర్గాల సమాచారం ప్రకారం, ఈ కొత్త సౌకర్యం కోసం IRCTC టికెటింగ్‌ సిస్టమ్‌లో సాంకేతిక మార్పులు చేయనున్నారు. ప్రయాణికులు తమ అకౌంట్‌లో లాగిన్‌ అయ్యి, ఆన్‌లైన్‌లోనే కొత్త తేదీని ఎంపిక చేసుకునే విధంగా సిస్టమ్‌ రూపకల్పన జరుగుతోంది.

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ మాట్లాడుతూ, “ప్రయాణికులకు మరింత స్నేహపూర్వకమైన అనుభవం కల్పించడమే మా లక్ష్యం. డిజిటల్‌ సాంకేతికతను ఉపయోగించి ప్రతి సేవను సులభతరం చేయాలని రైల్వే కృషి చేస్తోంది” అన్నారు. అయితే ఈ కొత్త రైల్వే నిర్ణయం లక్షలాది ప్రయాణికులకు పెద్ద ఊరటనిస్తుందనడంలో సందేహం లేదు. ఇకపై ప్లాన్‌ మారినా టెన్షన్‌ లేదు. కేవలం తేదీ మార్చి, ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా మీ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.