వ్యాపారం చెయ్యాలనుకుంటే కావాల్సింది ఆలోచన… నిజమే… ఏమి చెయ్యాలనే ఆలోచనల నుండే గొప్ప వ్యాపార సామ్రాజ్యాలు పుడతాయి. చిన్న, చిన్న వ్యాపారాలతో మొదలుపెట్టి కోట్లకు పడగలెత్తిన వారు ఎంతోమంది ఉన్నారు. రోడ్ పక్కన చిన్న బండి పెట్టుకుని దోశలేసుకునే బళ్లను చూసి వాళ్ళకేమి ఉంటుంది సంపాదన అని జనం అనుకుంటారు. కానీ దాంట్లో కూడా బీభత్సమైన వ్యాపారం చెయ్యవచ్చనీ, దానికి కావాల్సింది కమిట్మెంట్ అని మనకు ప్రూవ్ చేసి చూపించారు హైదరాబాద్ లో ఒక చిన్న దోశ బండి వ్యాపారి. ఈ రోజు కోట్లలో వ్యాపారం చేస్తూ ఇండియా మొత్తం వారి వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఎవరు ఆ వ్యక్తి, ఆ వ్యాపారం ఇంతగా సక్సెస్ కావడం వెనుకున్న ఫార్ములా ఏంటో మీకోసం…
డబ్బు సంపాదించాలనే కసి మీలో ఉండాలి కానీ ఏమి చేసినా డబ్బు వచ్చి పడుతుంది. పెద్ద సెటప్, భారీ పెట్టుబడులు లేకుండానే లక్షల్లో సంపాదించేవారు మన చుట్టూ చాలా మందే ఉంటారు. రోడ్ పక్కన చిన్న బండి పెట్టుకుని దోశలేసుకునే బళ్లను చూసి వాళ్ళకేమి ఉంటుంది సంపాదన అని జనం అనుకుంటారు. కానీ దాంట్లో కూడా బీభత్సమైన వ్యాపారం చెయ్యవచ్చనీ, దానికి కావాల్సింది కమిట్మెంట్ అని మనకు ప్రూవ్ చేసి చూపించారు రామ్ కి బండి రామ్ కుమార్ షిండే. ఏంటి రామ్ కీ బండి సక్సెస్ సీక్రెట్… ఎందుకు దేశమే వీరి గురించి మాట్లాడుకుంది…ఈ చిన్న దోశ బండి విజయరహస్యం ఏంటి..వివరాలు మీకోసం…
ప్రారంభం అయింది ఇలా:
రోడ్ పక్కన పెట్టిన ఒక దోశ బండి ఇప్పుడు ఫ్రాంచైజ్ మోడల్ లో తన పేరుతో అవుట్ లెట్స్ పెడుతుందంటే అది ఎంత సక్సెస్ ఫుల్ బిజినెస్ అర్థం చేసుకోవచ్చు. అసలు రామ్ కి బండి ప్రారంభం అయింది 1988 లో. ఆర్మీ లో పని చేసి రిటైరైన లక్ష్మణ్ రావ్ షిండే ఈ బండి మీద దోశ వ్యాపారాన్ని బేగంబజార్ ప్రాంతం లో ప్రారంభించాడు. ఇప్పుడు రామ్ కీ బండి ఇంత పెద్ద వ్యాపారం గా ఎదిగినా ఒకప్పుడు మామూలు దోశ బండే. అందరిలానే ఉదయం మసాలా దోస, ఇడ్లీ అమ్మేవారు. ఇప్పుడు దోశ బిజినెస్ ని ఈ స్థాయి కి తీసుకెళ్లిన రామ్ వయసు అప్పుడు 8 సంవత్సరాలు. అప్పట్లో పిల్లలను పోషించుకోవడానికి, వారిని చదివించుకోవడానికి ఈ వ్యాపారాన్ని వాళ్ళ నాన్న లక్ష్మణ్ ప్రారంభించాడు. ఈ వ్యాపారం ఇంత సక్సెస్ కావడం లో రామ్ పాత్ర ఎంతో, దానికంటే ముందే దీనికి బాటలు వేసిన వాళ్ళ నాన్నది కూడా అంతే పాత్ర ఉంది.
































