టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ (Toyota Urban Cruiser Taisor) ప్రస్తుతం భారతీయ మార్కెట్‌లో మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇది టయోటా నుంచి వచ్చిన కాంపాక్ట్ SUV అయినప్పటికీ, దాని స్టైల్, డిజైన్, పనితీరు, నమ్మకం కారణంగా వినియోగదారుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది.
టైజర్ ఆకర్షణీయమైన ఎక్స్‌టీరియర్ డిజైన్‌తో పాటు, ఆధునిక ఫీచర్లు, సౌకర్యవంతమైన ఇంటీరియర్ లేఅవుట్‌ను కలిగి ఉంది. ఇదే కారణంగా ఇది యువత, కుటుంబ వినియోగదారుల రెండింటికీ అనువైన SUVగా పేరు తెచ్చుకుంది. ఈ కారు ప్రధానంగా మారుతి సుజుకి ఫ్రాంక్స్‌పై ఆధారపడి, టయోటా ప్రత్యేక శైలిలో రీ-బ్యాడ్జ్ చేయబడింది. అయితే డిజైన్‌లో, ఫినిషింగ్‌లో టయోటా తన సొంత ముద్రను చూపించింది. కానీ టయోటా బ్రాండ్ ఇమేజ్‌ను స్పష్టంగా చూపిస్తుంది.
అమ్మకాల పరంగా కూడా టైజర్ స్థిరమైన ప్రదర్శన కనబరుస్తోంది. 2025 సెప్టెంబర్ నెలలో ఈ SUV 2,297 యూనిట్లు డెలివరీ చేయబడ్డాయి. గత సంవత్సరం ఇదే నెలలో 2,278 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే ఏడాదికి దాదాపు 1% పెరుగుదల. ఈ స్థిరమైన వృద్ధి టయోటా బ్రాండ్‌పై ఉన్న నమ్మకాన్ని స్పష్టంగా చూపిస్తోంది. టయోటా వాహనాలు సాధారణంగా దీర్ఘకాలిక పనితీరు కోసం ప్రసిద్ధి చెందాయి. టైజర్ కూడా అదే ప్రమాణాలను కొనసాగిస్తోంది.
టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ భారత మార్కెట్‌లో ధర పరంగా కూడా వినియోగదారులకు ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఈ SUV సరసమైన ధరకే లభించడం దీని విజయానికి మరో ప్రధాన కారణం. ఎక్స్-షోరూమ్ ధరలను పరిశీలిస్తే, టైజర్ కనిష్టంగా రూ.7.21 లక్షల నుంచి గరిష్టంగా రూ.12.06 లక్షల వరకు ఉంటుంది. ఈ ధర పరిధి మధ్యతరగతి నుంచి ప్రీమియం సెగ్మెంట్ వరకు ఉన్న అన్ని వర్గాల వినియోగదారులను ఆకర్షించేలా ఉంది.
టయోటా ఈ SUVని E, G, S, S ప్లస్ అనే నాలుగు వేరియంట్లలో అందిస్తోంది. ప్రతి వేరియంట్‌లో భద్రత, టెక్నాలజీ ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా S ప్లస్ వేరియంట్‌లో టాప్ ఎండ్ ఫీచర్లు ఉండటంతో యువతలో మంచి ఆదరణ పొందుతోంది. ఇంజిన్ పరంగా టైజర్ మూడు పవర్‌ట్రెయిన్ 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 1.2 లీటర్ CNG వేరియంట్ ఎంపికలను అందిస్తోంది.
ట్రాన్స్‌మిషన్ విషయంలో వేరియంట్‌పై ఆధారపడి 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. వేరియంట్, ఇంజిన్ ఆధారంగా 19 నుండి 28 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తుంది. అంటే ఇది కేవలం SUV మాత్రమే కాకుండా, బైక్‌లకు సాటిగా ఉన్న ఫ్యూయల్ ఎఫిషియెన్సీని ఇస్తుంది. దీని ఇంధన ట్యాంక్ సామర్థ్యం 37 లీటర్లు కావడంతో, దూర ప్రయాణాల్లో తరచుగా రీఫిల్ అవసరం ఉండదు.
టైజర్ గరిష్టంగా గంటకు 175 కిలోమీటర్ల వేగం సాధించగలదు, అలాగే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 10.98 సెకన్లలో చేరుతుంది. ఈ వేగం, ఈ క్లాస్‌కి చెందిన కాంపాక్ట్ SUVలలో అరుదుగా కనిపించే ఫలితంగా చెప్పవచ్చు. దీని క్యాబిన్ లుక్స్ ప్రీమియంగా ఉండి, టయోటా ప్రత్యేకమైన ఫినిషింగ్ నాణ్యతను ప్రతిబింబిస్తాయి. 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్‌తో వస్తుంది.
ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, ప్యాడిల్ షిఫ్టర్లు, వెనుక AC వెంట్ వంటివి ఉన్నాయి. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), క్రూయిజ్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ముఖ్య భద్రతా ఫీచర్లు ఉన్నాయి. అదనంగా, 360 డిగ్రీల సర్ఫౌండ్ వ్యూ కెమెరా సిస్టమ్ కూడా ఉంది.

































