భారీ అంచనాల మధ్య గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మూవీ గేమ్ ఛేంజర్.
ఈ పాన్ ఇండియా మూవీ జనవరి 10న గ్రాండ్ గా విడుదల అయింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఈ మూవీ మిక్స్ డ్ రివ్యూలు, మౌత్ టాక్ సొంతం చేసుకుంది. అయినప్పటికీ తొలి రోజు మంచి ఓపెనింగ్స్ అందుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది గేమ్ ఛేంజర్. దీంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా రామ్ చరణ్ గేమ్ చేంజర్ ( Game Changer) మూవీ కలెక్షన్స్ గురించే.. ఈ నేపథ్యంలో రెండవ రోజు ఏ రోజులో కలెక్ట్ చేసిందో ఆ వివరాలు చూస్తే ..
RRR మూవీ తర్వాత రామ్ చరణ్ నటించిన సోలో హీరో సినిమా కావడం,కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తొలిసారిగా ఓ స్ట్రెయిట్ తెలుగు సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో గేమ్ ఛేంజర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. శంకర్ గత సినిమాలు అంచనాలను అందుకోలేకపోవడంతో ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకుని తెరకెక్కించారు. ఈ మూవీలో రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించగా.. అంజలి , ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
డైరెక్టర్ శంకర్ – గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కారణంగా గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ రేంజ్ లో జరిగింది. రిలీజ్ ముందు విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్లతో గేమ్ చేంజర్ సినిమాపై భారీ అంచనాలు నెలకున్నాయి. అంతేకాదు.. సోలోగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లో రికార్డు స్థాయి బిజినెస్‌గా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో 150 కోట్ల రూపాయల షేర్, 300 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు ఫిల్మీ ట్రేడర్స్.
గేమ్ ఛేంజర్ తొలి రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్ బాగానే ఉంటున్నాయి. రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించిన గేమ్ ఛేంజర్ మూవీకి డే 1 రూ. 51 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. సక్నిల్క్ సంస్థ అంచనాల ప్రకారం.. గేమ్ ఛేంజర్ మూవీ ఇండియాలో తొలి రోజు రూ. 51 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసినట్టు తెలిపింది. ఇందులో తెలుగు నుంచి రూ. 41.24 కోట్లు రాగా.. హిందీ బెల్ట్‌లో రూ. 7.5 కోట్లు, కర్ణాటకలో 10 లక్షలు, తమిళంలో 2.12 కోట్లు, మలయాళంలో 3 లక్షలుగా ఉన్నట్లు పేర్కొంది.
కానీ, తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ రూ. 186 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు మూవీ మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. దీంతో గేమ్ ఛేంజర్ తొలి రోజు కలెక్షన్స్‌పై కాస్తా కన్‌ఫ్యూజన్ క్రియేట్ అయింది. ఈ కలెక్షన్లు ప్రకారం.. గేమ్ చేంజర్ సినిమా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్‌గా హిట్ కావాలంటే ఇంకా రూ. 166.58 కోట్ల కలెక్షన్స్ రాబట్టాలి.
ఇక రెండోవ రోజు గేమ్ ఛేంజర్ కలెక్షన్స్ వివరాలు చూస్తే.. ఇక రెండో రోజు గేమ్ ఛేంజర్ కలెక్షన్స్ తగ్గినట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు రెండో రోజు గేమ్ చేంజర్ ఇండియాలో రూ. 12.33 కోట్ల నెట్ కలెక్షన్స్ నమోదు అయినట్లు సక్నిల్క్ సంస్థ వెల్లడించింది. అయితే… నైట్ షోలకు రెస్పాన్స్ బాగుంటే.. కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. కానీ, ఎలా ఉన్నా.. మొదటి రోజు కంటే రెండో రోజు కలెక్షన్స్ ల్లో మాత్రం తగ్గుదల కనిపిస్తుంది. పొలిటికల్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్ రెండు రోజుల్లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద రూ. 63.33 కోట్ల నికర వసూళ్లను రాబట్టే అవకాశం ఉన్నట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు.