గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా గేమ్ ఛేంజర్ తెరకెక్కింది.
గేమ్ ఛెంజర్ సినిమాలో హీరోయిన్‌గా చేసిన కియారా అద్వానీ రెండోసారి రామ్ చరణ్ సరసన నటించింది.
24 గంటల్లోనే
శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మాతగా వ్యవహరించిన గేమ్ ఛేంజర్ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ అయిన గేమ్ ఛేంజర్ ట్రైలర్, పోస్ట్, టీజర్, సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఇక గేమ్ ఛేంజర్ ట్రైలర్ అయితే రిలీజైన 24 గంటల్లోనే అత్యధిక వ్యూస్ సాధించిన టాలీవుడ్ మూడో సినిమాగా రికార్డ్ కొట్టింది.
ఓవర్సీస్‌లో సెన్సార్ పూర్తి
యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో గేమ్ ఛేంజర్ ట్రైలర్ దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే, జనవరి 10న సంక్రాంతి కానుకగా గేమ్ ఛేంజర్ మూవీ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ అంటూ పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. అయితే, గేమ్ ఛేంజర్ మూవీకి ఓవర్సీస్‌లో సెన్సార్ పూర్తయినట్లు తెలుస్తోంది.
గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ
ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్స్‌లో ఒకరిగా, దక్షిణాది ఫిల్మ్ క్రిటిక్‌గా చెప్పుకునే ఉమైర్ సంధు తాజాగా ట్విటర్‌లో కొన్ని పోస్టులు పెట్టాడు. అయితే, ఓవర్సీస్ సెన్సార్‌లో సినిమాను చూసిన ఉమైర్ సంధు గేమ్ ఛేంజర్‌పై రివ్యూ ఇచ్చాడు. ఎక్స్‌లో గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ అంటూ పలు ట్వీట్స్ చేశాడు.
సినిమా టార్చర్
“ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ నుంచి గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ. ఇది అస్సలు వర్కౌట్ కాలేదు. శంకర్, రామ్ చరణ్‌ల మూవీ ఏమాత్రం చూసే విధంగా లేదు. మెయిన్ లీడ్ యాక్టర్స్ అంతా క్రింజ్, పూర్ పర్ఫామెన్స్ ఇచ్చారు. అవుట్ డేటెడ్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్‌తో బోరింగ్‌గా ఉంది. రామ్ చరణ్ అభిమానులకు సారీ. ఈ సినిమా ఒక టార్చర్” అంటూ ట్వీట్ చేసిన ఉమైర్ సంధు 2 స్టార్ రేటింగ్ మాత్రమే ఇచ్చాడు.
మరొక పోస్ట్‌లో “డైరెక్టర్ శంకర్ కచ్చితంగా సినిమాల నుంచి రిటైర్ కావాలి. నీ 80, 90 కాలం నాటి చెత్త పొలిటికల్ సినిమాలు చూసి విసిగిపోయాం. మొదట ఇండియన్ 2. ఇప్పుడు గేమ్ ఛేంజర్. నువ్ జనాలకు టార్చర్ డైరెక్టర్‌వి. అతన్ని బ్యాన్ చేయండి. నువ్ కమల్ హాసన్, రామ్ చరణ్ కెరీర్‌లను నాశనం చేశావ్” అని ఉమైర్ సంధు రాసుకొచ్చాడు.