ఉత్తరప్రదేశ్‌లో దొంగ నోట్లు ముద్రిస్తున్న ముఠా గుట్టురట్టు.. చివరికి ఏమైందంటే?

www.mannamweb.com


నకిలీ కరెన్సీ నోట్ల ముఠాను పట్టుకున్న పోలీసులు.. అని మార్కెట్ లో యథేచ్ఛగా కొనసాగుతున్న నకిలీ నోట్లు అని.. ఇలా దీనికి సంబంధించిన ఎదో ఒక వార్తను ఎదో ఒక సంధర్భంలో వినే ఉంటారు. మార్కెట్ లో అనేక నకిలీ నోట్లు పెరిగాయని గతంలో.. ఆర్బీఐ సైతం ప్రకటించింది. ప్రజలంతా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరించింది. అయినా సరే ఇంకా పలు రాష్ట్రాల్లో ఈ నకిలీ నోట్ల తయారీ, పంపిణి దందా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా ఇలా నకిలీ నోట్లను తయారు చేసే గ్యాంగ్ ను పోలీసులు పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఖుషి నగర్ లో చోటు చేసుకుంది. ఈ గ్యాంగ్ కు సంబంధించిన పది మందిని పోలీసులు అరెస్ట్ చేసి.. వారి వద్ద నుంచి కొన్ని లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తప్రదేశ్ లోని లక్నో ప్రాంతంలో ఖుషినగర్ పరిధిలో.. నకిలీ నోట్లను తయారు చేసి, సరఫరా చేస్తున్న ముఠాలోని.. 10 మంది సభ్యులను ఖుషినగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అంతే కాకుండా వారి నుంచి అక్రమ ఆయుధాలు , మత్తు పదార్ధాలతో పాటు రూ.5.62 లక్షల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా అరెస్ట్ అయిన వారు.. మహ్మద్ రఫీక్ ఖాన్ , నౌషాద్ ఖాన్, మహ్మద్ రఫీ అన్సారీ, ఔరంగజేబ్, షేక్ జమాలుద్దీన్, నియాజుద్దీన్, రెహాన్ ఖాన్, హసీం ఖాన్, సెరాజ్ హష్మతి , పర్వేజ్ ఇలాహీగా పోలీసులు గుర్తించారు. అంతే కాకుండా పట్టుబడిన వారిలో ఒకడైన మహ్మద్ రఫీక్ పై ఇప్పటికే 36 కేసులు ఉన్నాయంటూ పోలీసులు తెలియజేశారు. అలాగే విక్రయించిన నకిలీ నోట్లలో రూ.1.10 లక్షల నిజమైన ఇండియన్ కరెన్సీ , 3 వేల నేపాల్ కరెన్సీ , 30 లైవ్ కాట్రిడ్జ్ లు , 315 బోర్ పిస్టల్స్ , 12 ఖాళీ షెల్స్ , 4 హ్యాండ్ మేడ్ బాంబులు, 26 ఫేక్ సిమ్ కార్డ్స్ , 13 మొబైల్ ఫోన్స్ , 10 నకిలీ ఆధార్ కార్డ్స్ , 10 ATM కార్డ్స్ , 8 ల్యాప్ టాప్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

అలాగే అరెస్ట్ అయినా ఓ గ్యాంగ్ లోని వీరంతా కూడా ఓ క్రైమ్ సిండికేట్ లో భాగం అని చెప్పారు. మార్కెట్ లో లావాదేవీల కోసం ఇలా నకిలీ నోట్లను ఒరిజినల్ నోట్లతో కలుపుతూ ఉంటారని. ఇక ఆ తర్వాత ఆ డబ్బును వివాదాస్పదమైన భూములను విక్రయించడం , తుపాకీలు , పేలుడు పదార్ధాలు లాంటివి కొనేందుకు ఉపయోగిస్తూ ఉంటారని.. అరెస్ట్ వారిలో చాలా మందిపై నేర ఆరోపణలు ఉన్నాయని.. మహ్మద్ రఫీ అన్సారీ, ఔరంగజేబ్ వ్యక్తులపై చాలా పోలీస్ స్టేషన్స్ లో పలు కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. అలాగే వారిపై కఠిన చర్యలు తీసుకున్నట్టుగా కూడా వెల్లడించారు ఖుషి నగర్ పోలీసులు. ఏదేమైనా ఇలా నకిలీ నోట్ల తయారీ దందా అన్ని చోట్ల జరుగుతూనే ఉంది.