పోస్టింగ్‌ ఇవ్వండి.. సీఎస్‌ను కలిసిన ఏబీ వెంకటేశ్వరరావు

పోస్టింగ్‌ ఇవ్వండి.. సీఎస్‌ను కలిసిన ఏబీ వెంకటేశ్వరరావు


సీనియర్ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) సచివాలయంలో సీఎస్‌ జవహర్‌రెడ్డిని కలిశారు. ఏపీ హైకోర్టు ఆదేశాల ప్రతిని సీఎస్‌కు అందజేశారు. కోర్టు ఉత్తర్వుల మేరకు పోస్టింగ్‌ ఇచ్చే అంశంపై త్వరితగతిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కోర్టు ఉత్తర్వుల ప్రతిని సీఈవో కార్యాలయంలో కూడా ఏబీవీ అందజేశారు.

ఏబీ వెంకటేశ్వరరావుకి గురువారం ఉదయం హైకోర్టులో ఊరట లభించింది. కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ఉత్తర్వులను సస్పెండ్‌ చేసేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఏబీవీ సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఇటీవల క్యాట్‌ ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వులను నిలుపుదల చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. క్యాట్‌ ఉత్తర్వులను సస్పెండ్‌ చేసేందుకు నిరాకరిస్తూ ప్రభుత్వ అప్పీల్‌ను కొట్టివేసింది.