కలబందతో మెరిసే అందం మీ సొంతం.. ఎలా వాడాలంటే?

www.mannamweb.com


అలోవెరాలో A, C, E విటమిన్లు , ఫోలిక్ యాసిడ్, కోలిన్, B1, B2, B3, B6, B12 విటమిన్లు, కాల్షియం, మెగ్నీషియం, జింక్, క్రోమియం, సెలీనియం, సోడియం, ఐరన్, పొటాషియం వంటి దాదాపు 20 రకాల ఖనిజాలు ఉంటాయి.

మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందుకే ఆయుర్వేదంలో కలబందకు ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో వ్యాధుల నివారణకు దీనిని ఔషధంగా వినియోగిస్తారు. కాబట్టి అలోవెరా జెల్ ప్రయోజనాలు, దానిని ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం..

అలోవెరా జెల్‌ని ముఖానికి అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..

అలోవెరా జెల్ ముఖంపై ఫైన్ లైన్స్ సమస్య నుంచి బయటపడటానికి సులభమైన పరిష్కారం. దీన్ని చేతులు, ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మంలో కొల్లాజెన్ స్థాయిలు పెరిగి చర్మం మెరుస్తుంది. దీన్ని రోజూ ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం మృదువుగా, ఆరోగ్యంగా మారుతుంది.

సూర్య కిరణాల నుంచి రక్షణ

అలోవెరా శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. అలోవెరా జెల్‌ను ముఖానికి అప్లై చేయడం వల్ల దద్దుర్లు, ముఖం వాపు నుండి ఉపశమనం పొందవచ్చు. దీన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల సూర్యకిరణాలు చర్మంపై ప్రభావం చూపవు. బయట ఎక్కువ పని చేసే వారు ఇంటికి వచ్చిన తర్వాత అలోవెరా జెల్‌ని ముఖానికి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

మొటిమల నివారణ

రాత్రిపూట అలోవెరా జెల్‌ను ముఖానికి రాసుకుంటే ముఖ రంధ్రాలలో పేరుకుపోయిన దుమ్మును పోగొట్టి ముఖంపై మొటిమలను నివారించవచ్చు. ముఖంపై విడుదలయ్యే అధిక నూనె మొటిమలను కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిల్లో చర్మం నుంచి అదనపు నూనెను తొలగించడానికి అలోవెరా జెల్ ఉపయోగపడుతుంది.