Glowing skin: శీతాకాలంలో మెరిసే చర్మం కోసం.. ఇంట్లోనే సులభంగా చేసుకునే చిట్కాలు మీ కోసం..

www.mannamweb.com


ప్రస్తుతం యువత ఫిట్‌నెస్‌తో పాటూ అందంగా కనిపించేందుకు తెగ ఆరాటపడిపోతుంటారు. ఇందుకోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడరు. మరికొందరు పార్లర్లలో వేలకు వేలు ఖర్చు చేసి ఏవేవో చికిత్సలు చేయించుకుంటుంటారు. మరోవైపు ముఖ సౌందర్యం కోసం చాలా మంది ఏవేవో క్రీములు ట్రై చేస్తుంటారు. అయినా..

ప్రస్తుతం యువత ఫిట్‌నెస్‌తో పాటూ అందంగా కనిపించేందుకు తెగ ఆరాటపడిపోతుంటారు. ఇందుకోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడరు. మరికొందరు పార్లర్లలో వేలకు వేలు ఖర్చు చేసి ఏవేవో చికిత్సలు చేయించుకుంటుంటారు. మరోవైపు ముఖ సౌందర్యం కోసం చాలా మంది ఏవేవో క్రీములు ట్రై చేస్తుంటారు. అయినా కొన్నిసార్లు ఎలాంటి ఫలితం కనిపించదు. ఇక శీతాకాలంలో చర్మం పొడిబారి అందవిహీనంగా కనిపిస్తుంది. ఈ సమస్యను అదిగమించేందుకు ఇంట్లోని వస్తువులతో సింపుల్‌గా చేసుకునే కొన్ని చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చలికాలంలో చర్మం బిగుతుగా మారడంతో పాటూ పొడిబారుతుంది. చలిగాలి కారణంగా చర్మాన్ని రక్షించే నూనె తొలగిపోయి అనేక సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి శీతాకాలంలో చర్మాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. ఇందుకోసం చర్మం హైడ్రేడ్‌గా ఉండడానికి తరచూ నీరు తాగుతుండాలి. బయటికి వెళ్లే సమయంలో సన్‌స్ర్కీన్ లోషన్‌ను వాడాలి. వీటిలో పాటూ ముఖం మెరిసేలా చేసేందుకు ఇంట్లోనే చేసుకునే కొన్ని రెమిడీస్ కూడా ఉన్నాయి.

ఇంట్లోనే ఇలా ఫేసియల్ చేసుకోండి..

ముఖంపై సహజసిద్ధమైన ఫేసియల్ కోసం ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు. ఇందుకోసం ఒక గిన్నెలో రెండు చెంచాల ఓట్స్ పౌడర్, 3 చెంచాల పాలు, ఒక చెంచా గ్లిజరిన్ తీసుకోవాలి. తర్వాత వాటిని బాగా కలిపి ముఖానికి రాసుకోవాలి. సుమారు 5 నిముషాల సేపు అలాగే ఉంచి, తర్వాత శుభ్రంగా కడిగేయాలి

పెరుగుతో ఇలా చేయండి..

ముఖంపై మసాజ్ చేసేందుకు రెండు చెంచాల పెరుగు, బీట్‌రూట్ రసం తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని సుమారు 10 నిముషాల పాట ముఖంపై మసాజ్ చేయాలి. తర్వాత మంచి నీటిలో కడిగేయాలి. ఇలా చేస్తే చర్మం మృదువుగా మారడంతో పాటూ కాంతివంతంగా ఉంటుంది.

ఫేస్ ప్యాక్ కోసం..

సహజ సిద్ధమైన ఫేస్ ప్యాక్ కోసం ముల్తానీ మట్టి, శనగ పిండి, బంగాళా దుంప రసం తీసుకోవాలి. అందులో అర చెంచా గ్లిజరిన్, కొన్ని పాలు వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 10 నిముషాలు అలాగే ఉంచి శుభ్రం చేసుకోవాలి. దీంతో పాటూ చియా గింజలు, బీట్‌రూట్ రసం, పాలను కలిపి కూడా ఫేస్ ప్యాక్ తయారు చేయవచ్చు. ఇలాంటి ఫేస్ ప్యాక్ చేసుకోవడం వల్ల ముఖంపై నల్ల మచ్చలు కూడా తొలగిపోయి మెరుస్తూ ఉంటుంది. పొడి చర్మం ఉన్న వారు ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.