బిగ్ న్యూస్.. ఫ్రీ బస్సు పథకం ప్రారంభంపై జీవో విడుదల

ఏపీ అసెంబ్లీకి 2024 లో జరిగిన ఎన్నికల్లో కూటమి (alliance) ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ (Free travel on RTC buses) పథకాన్ని ప్రారంభించనున్నారు.


ఈ క్రమంలో ఈ పథకానికి సంబంధించిన అధికారిక జీవో (Official GO)ను రాష్ట్ర ప్రభుత్వం (State Govt) విడుదల చేసింది. అందులో ఈనెల 15 నుంచి TR&B శాఖ – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC)/AP ప్రజా రవాణా శాఖ ద్వారా (APPTD) స్త్రీ శక్తి పథకం (STREE SHAKTI SCHEME) అమలు కానుంది. ఆర్డినరీ, పల్లెవెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లో మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి వస్తుంది. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సుల్లో ఉండే మహిళా కండక్టర్ల యూనిఫామ్‌కు కెమెరాలు అటాచ్ చేయాలి, అలాగే అన్ని బస్‌స్టేషన్లలో సదుపాయాలు మెరుగుపరచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉచిత (స్త్రీశక్తి పథకం) బస్సు ప్రయాణం పథకానికి అర్హులైన మహిళా ప్రయాణికులకు జీరో ఫేర్‌ టికెట్లు (Zero Fare Tickets) ఇవ్వాలని, ఆ ఖర్చును ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం రీయింబర్స్‌ చేయనున్నట్లు ప్రకటించింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.