గోదావరి పుష్కరాల ముహూర్తం, కుంభమేళా తరహాలో- ఈ సారి ప్రత్యేకతలు.

గోదావరి పుష్కరాలకు ఈ సారి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముహూర్తం ఖరారైంది. దేశ విదేశాల నుంచి గోదావరి పుష్కరాలకు తరలి రానున్నారు. కేంద్రంతో పాటుగా ఏపీ ప్రభుత్వం పుష్కరాల నిర్వహణ కోసం ప్రత్యేక చర్యలు మొదలు పెట్టింది.


కేంద్రం నిధులను ప్రకటించింది. రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కమిటీల ఏర్పాటుతో పాటుగా నిధులను విడుదల చేసింది. కాగా.. కుంభమేళా తరహాలో ఘాట్లు – వసతి సౌకర్యం కల్పిస్తున్నారు.

గోదావరి పుష్కరాల కోసం ఏర్పాట్లు మొదలయ్యాయి. ముహూర్తం ఖరారు 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాల నిర్వహణకు నిర్ణయించారు. కేంద్రం ముందస్తుగానే గోదావరి పుష్కరాల కోసం నిధులు కేటాయించింది. ఇప్పటికే రూ 100 కోట్ల ను పుష్కరాల కోసం ప్రకటించారు. తాజాగా రైల్వే శాఖ పుష్కరాల కు వచ్చే భక్తుల సౌకర్యాల కల్పన కోసం రాజమండ్రి రైల్వే స్టేషన్ కు రూ 271.43 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్రధాన ప్రాంతాల నుంచి రాజమండ్రికి ప్రత్యేక రైళ్లు నడుపుతామని.. ముందస్తు గానే ఖరారు చేస్తామని అధికారులు వెల్లడించారు. అఖండ గోదావరి పుష్కరాలు-2027 ముసాయిదా యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధమైంది. అందరూ ఒకే ఘాట్‌లో స్నానాలు చేసే అవసరం లేకుండా గోదావరి నదిలో ఎక్కడైనా స్నానాలు చేయొచ్చని ప్రచారం చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న 17 ఘాట్లకు రోజుకు 75,11,616 మంది వస్తారని అంచనా వేస్తున్నారు.

2015 లో ఇదే గోదావరి పుష్కరాల ప్రారంభం వేళ చోటు చేసుకున్న ఘటనలు విషాదం మిగి ల్చాయి. ఈ సారి పుష్కరాల కోసం 8 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. దీంతో గోదావరి జిల్లాల్లో పుష్కర ఘాట్ల అభివృద్ధికి రూ.904 కోట్లతో ప్రతిపాదలు అధికార యంత్రాంగం సిద్దం చేసింది. సుమారు రెండున్నరేళ్ల కంటే ఎక్కువ సమయం ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధులు, అధికారులు ఇప్పటి నుంచే రంగంలోకి దిగారు. కుంభమేళ, రామ ప్రతిష్ట తరహాలో గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పుష్కర ఘాట్ల వద్ద ఉచిత మెడికల్ క్యాంపులు, భక్తుల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేస్ తున్నారు. పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని వచ్చే భక్తులకు అనుగుణంగా బఫర్ జోన్​ ను ప్రతి పాదిస్తున్నారు. స్టే హోమ్ అనే ప్రతిపాదనతో రెండు రోజులు విడిది ఉండేలాగా ప్రజలతో మమేకం అయ్యే కార్యక్రమాన్ని ప్రతిపాదిస్తున్నారు.

ఇందు కోసం కోసం స్వయం సహాయక సంఘాల మహిళలకు 30 రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. అఖండ గోదావరి పుష్కరాలు-2027 ముసాయిదా యాక్షన్‌ ప్లాన్‌ కూడా సిద్ధమైంది. అందరూ ఒకే ఘాట్‌లో స్నానాలు చేసే అవసరం లేకుండా గోదావరి నదిలో ఎక్కడైనా స్నానాలు చేయొచ్చని ప్రచారం చేయనున్నారు. మరో నాలుగు కొత్త ఘాట్లు అవసరమని భావిస్తున్నారు. యాత్రికుల బస ఏర్పాట్లపై చర్చించారు. రాజమహేంద్రవరం పరిధిలో గోదావరి ఘాట్ల అభివృద్ధికి రూ.904 కోట్లతో బడ్జెట్‌ ప్రతిపాదించారు. కార్పొరేషన్‌ రోడ్ల అభివృద్ధికి రూ.456.5 కోట్లు, ఆర్‌అండ్‌బీ రోడ్లు, బ్రిడ్జిల అభివృద్ధికి రూ.678.76 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. సిటీ బ్యూటిషికేషన్‌, ఐకానిక్‌ టూరిజం సైట్‌ ప్రాజెక్టు కోసం రూ.75 కోట్లతో ప్రతిపాదనలు చేసారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో గోదావరి పుష్కరాల పైన ఉన్నత స్థాయి సమీక్ష జరగనుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.