గోల్డ్ లోన్ తీసుకున్నవారికి భారీ శుభవార్త..తీపికబురు చెప్పిన ఆర్బిఐ

గోల్డ్ లోన్ పై బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయని రిజర్వ్ బ్యాంక్ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ద్రవ్య విధాన కమిటీ సమావేశం తర్వాత గోల్డ్ లోన్స్ కు సంబంధించిన సమగ్ర నియమాలను సెంట్రల్ బ్యాంక్ త్వరలో ప్రకటిస్తుందని తెలిపారు. ఈ నియమాలు బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు రిస్క్ టేకింగ్ కెపాసిటీపై ఆధారపడి ఉంటాయి. తద్వారా ఈ లోన్స్ ఇతర లోన్స్ మాదిరిగానే నియంత్రించవచ్చు.


గోల్డ్ లోన్స్ ప్రస్తుత పనితీరుపై గత ఏడాది సెప్టెంబర్ 30న రిజర్వ్ బ్యాంక్ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఆ సమయంలో ఆర్బిఐ తన నివేదికలో లోన్స్ మూలం, బంగారం మూల్యాంకన ప్రక్రియ, డబ్బు వినియోగాన్ని పర్యవేక్షించడం, వేలం పాటల పారదర్శకత, రుణం నుంచి విలువ నిష్యత్తిలో లోపాలను హైలైట్ చేసింది. అదనంగా రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుత లోన్స్ ముందస్తు వ్యవస్థ, దాని పాక్షిక చెల్లింపుపై ఆందోళన వ్యక్తం చేసింది.

బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు అందించే గోల్డ్ లోన్స్ పై ప్రస్తుతం బుల్లెట్ తిరిగి చెల్లింపు నమూనాను అవలంబిస్తున్నారు. అంటే లోన్ తీసుకున్న కస్టమర్ ప్రతినెలా దాని వడ్డీని మాత్రమే చెల్లిస్తారు. అయితే పూర్తి లోన్ మొత్తాన్ని చెల్లించిన తర్వాతే వారి నగలు వారికి తిరిగి ఇస్తారు. అయితే కస్టమర్ కోరుకుంటే అతను మధ్యో పాక్షిక చెల్లింపులు కూడా చేసుకోవచ్చు.

ప్రస్తుత బంగారు రుణాల నమూనా బ్యాంకులతోపాటు సామాన్య ప్రజలకు కూడా ప్రమాదకరమని రిజర్వ్ బ్యాంక్ విశ్వసిస్తోంది. డిఫాల్ట్ కారణంగా సాధారణ కస్టమర్లు తమ నగలను బ్యాంక్ నుంచి రీడిమ్ చేసుకోలేకపోతున్నారు. బ్యాంకు కూడా వారి లోన్ చెల్లించడంలో డిఫాల్డ్ అయ్యే ప్రమాదం ఉంది

గోల్డ్ లోన్స్ పై హోం, ఆటో లోన్స్ వంటి ఈఎంఐ ఏర్పాటును ప్రారంభించడం మంచిది. ఇది సామాన్యులకు గోల్డ్ లోన్స్ ను తిరిగి చెల్లించడానికి సులభతరం చేస్తుంది. డిఫాల్ట్ వంటి పరిస్థితులను కూడా నివారిస్తుంది.

ప్రస్తుత గోల్డ్ లోన్స్ నమూనా కూడా బంగారం ధరల్లో హెచ్చుతగ్గుల ప్రమాదాన్ని కలిగి ఉంటుంది. బంగారం ధరలు వేగంగా పడిపోతే ఎల్టీవీ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి బ్యాంకుల లోన్స్ మొత్తాలు స్తంభిస్తాయి. అదేవిధంగా బంగారం ధరలు పెరిగినట్లయితే కస్టమర్ తమ ఆభరణాలకు తక్కువ విలువను పొందుతారు. ఎందుకంటే వారు పొందే లోన్ మొత్తం పాత బంగారం ధరలపై ఆధారపడి ఉంటుంది.