కొత్త సంవత్సరంలో పసిడి ప్రియులకు భారీ శుభవార్త అందింది. ఈ ఏడాది ప్రారంభం కాగానే వరుసగా మూడు రోజులపాటు పెరిగిన బంగారం ధరలు నాలుగో రోజు తగ్గాయి. శనివారం బంగారం ధర భారీగా తగ్గింది. దాంతో పసిడి ప్రియులలో మరోసారి ఆనందం నెలకొన్నది.
100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారంకు 4900 తగ్గింది. అదేవిధంగా 100 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం కు 4500 తగ్గింది. హైదరాబాదులో 22 క్యారెట్స్ బంగారం శుక్రవారం 7,26,000 ఉండగా శనివారం 4500 తగ్గి 7,21,500 ఉంది.
అదే విధంగా 24 క్యారెట్స్ బంగారం శుక్రవారం 7,92,000 ఉండగా 4900 తగ్గి 7,87,100 రూపాయలు ఉంది. 10 గ్రాముల తులం బంగారం 22 క్యారెట్స్ 72,150 ఉండగా 24 క్యారెట్స్ 78,710 ఉంది. హైదరాబాదులో ఉన్న ధరలే తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పట్టణాల్లో కూడా అవే కొనసాగుతున్నాయి.