Gold Rate Today: దేవుడా ఇక బంగారం ధర తగ్గదా..? మార్చి 16న రికార్డులు బద్దలు కొట్టిన బంగారం ధర

Gold Rate Today: మార్చ్ 16వ తేదీ ఆదివారం కూడా బంగారం ధర రికార్డు స్థాయి వద్దనే కొనసాగుతోంది. బంగారం ధర ప్రస్తుతం రూ.90,000 ఎగువన ఉంది, ఈ నేపథ్యంలో తాజా బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 90,670 పలికింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 82,800 పలికింది. ఒక కేజీ వెండి ధర రూ. 1,02,968 పలుకుతోంది. బంగారం ధర గత మూడు రోజులుగా గమనించినట్లయితే భారీగా పెరిగింది. మార్చి నెలలో బంగారం ధర ఒక దశలో తగ్గినప్పటికీ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ఆర్థిక మాంద్యం వ్యాఖ్యల తర్వాత దెబ్బకు బంగారం ధర భారీగా పెరగడం ప్రారంభించింది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో పెద్ద ఎత్తున పతనం అవడంతో పాటు ఇన్వెస్టర్లు సెంటిమెంట్ దెబ్బ తిన్నది. దీంతో సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించే బంగారంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలివస్తున్నాయి. దీంతో బంగారం ధర చాలా వేగంగా రికార్డు స్థాయిని తాకింది.
బంగారం ధర పెరగడం వెనుక అంతర్జాతీయంగా ఉన్న కారణాలు ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవల ఇతర దేశాల పైన పెద్ద ఎత్తున దిగుమతి టారిఫ్ ప్లాన్లు పెంచడంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్ దెబ్బతింటోంది. ముఖ్యంగా ఆసియా స్టాక్ మార్కెట్లతో పాటు అమెరికా స్టాక్ మార్కెట్ కూడా పెద్ద ఎత్తున దెబ్బతిన్నది. దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను అత్యంత సురక్షితంగా భావించటం బంగారం వైపు తరలిస్తున్నారు. ఫలితంగా బంగారానికి డిమాండ్ పెరిగి ఒక్కసారిగా ధరలు పెరగడం ప్రారంభించాయి. అలాగే బంగారం పెద్ద మొత్తంలో కొనుగోలు చేసేందుకు చైనా సిద్ధం అవుతుంది. చైనా ఇటీవల కాలంలో భారీ ఎత్తున బంగారం కొనుగోలు చేసి తన బంగారం నిలువలను పెంచుకుంది.
బంగారం ధర భారీగా పెరిగిన నేపథ్యంలో పసిడి ఆభరణాలు కొనుగోలు చేసే వారికి ఇది షాక్ అనే చెప్పాలి ఎందుకంటే బంగారం ధర భారీగా పెరగడం వల్ల ఇకపై బంగారం కొనుగోలు చేయాలంటే ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఏర్పడింది దీంతో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారికి తక్కువ బంగారం లభించే అవకాశం ఉంటుంది అయితే బంగారు ఆభరణాల వారు తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు తక్కువ బరువు ఉన్న డిజైన్లను సైతం అందుబాటులో ఉంచుతున్నారు.