Gold Price: తగ్గేదేలే.. మళ్లీ భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తాజా రేట్లు ఇవే..

పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయంగా జరగుతున్న పరిణామాల ప్రకారం ధరలు కొన్ని సార్లు పెరిగితే మరికొన్నిసార్లు తగ్గుతుంటాయి.. అయితే.. గత కొంతకాలం నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో రికార్డు స్థాయిలో ధరలు ఎగబాకుతున్నాయి.. అయితే.. గత ఏడాదికాలంలోనే పసిడి ధర 38 శాతం పెరిగినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో తాజాగా గోల్డ్, సిల్వర్ ధర పెరిగింది. శనివారం (15 మార్చి 2025) ఉదయం ఆరు గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.82,310, 24 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర రూ.89,790 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,03,100 గా ఉంది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.11,00 వరకు పెరగగా, అదే 24 క్యారెట్లపై రూ.1200 వరకు పెరిగింది. వెండి ధరలు కూడా లక్ష మార్కును దాటి పరుగులు పెడుతున్నాయి. అయితే..


ఈ ధరలు ప్రాంతాల ప్రకారం మారుతూ ఉంటాయి..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి..

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.82,310, 24 క్యారెట్ల ధర రూ.89,790 గా ఉంది.

విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.82,310, 24 క్యారెట్ల ధర రూ.89,790 గా ఉంది.

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.82,460, 24 క్యారెట్ల ధర రూ.89,940 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.82,310, 24 క్యారెట్ల ధర రూ.89,790 గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.82,310, 24 క్యారెట్ల రేటు రూ.89,790 గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.82,310, 24 క్యారెట్ల ధర రూ.89,790 గా ఉంది.

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,12,100
విజయవాడ, విశాఖపట్నంలో రూ.1,12,100
ఢిల్లీలో వెండి కిలో ధర రూ.103,100 లుగా ఉంది.
ముంబైలో రూ.103,100 గా ఉంది.
బెంగళూరులో రూ.103,100లుగా ఉంది.
చెన్నైలో రూ.1,12,100 లుగా ఉంది.
కాగా, ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవిగా గమనించగలరు. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలియాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.