వరుసగా 3వ రోజు రూ.1100 పైనే పెరిగిన బంగారం ధర… ఇవాళ తులం ఎంతంటే

బంగారం ధరలు అస్సలు ఆగట్లేదు. గోల్డ్ రేట్ వరుసగా పెరుగుతోంది. వరుసగా మూడో రోజు బంగారం ధర రూ.1,100 పైనే పెరగడం విశేషం. మరి ఇవాళ హైదరాబాద్‌లో తులం బంగారం ధర ఎంత ఉందో తెలుసుకోండి.


బంగారం ధర మరో ఆల్ టైమ్ హైని టచ్ చేసింది. కేవలం రూ.1700 పెరిగితే చాలు… తులం బంగారం రూ.1.25 లక్షలకు చేరుకుంటుంది. ఇదే ట్రెండ్ కొనసాగితే ఈవారంలోనే బంగారం ధర ఈ మార్క్ దాటడం ఖాయం. ఇక వచ్చేవారం ధంతేరాస్ నాటికి గోల్డ్ రేట్ మరింత పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి.

అక్టోబర్ 8న కూడా హైదరాబాద్‌లో బంగారం ధరలు చూస్తే కొత్త ఆల్ టైమ్ హైకి గోల్డ్ రేట్స్ చేరుకున్నాయి. స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర 10 గ్రాములపై ఏకంగా రూ.1,150 పెరిగి రూ.1,22,020 నుంచి రూ.1,23,170కి పెరిగింది. ఇక 22 క్యారట్ బంగారం ధర చూస్తే ఇవాళ రూ.1050 పెరిగి రూ.1,11,850 నుంచి రూ.1,12,900 కి చేరుకుంది. ఇక 18 క్యారట్ గోల్డ్ ధర రూ.860 పెరిగి రూ.91,520 నుంచి రూ.92,380కి పెరిగింది.

హైదరాబాద్ మార్కెట్‌లో వెండి ధరలు స్థిరంగానే ఉన్నాయి. ఇవాళ కిలో వెండి ధర రూ.100 తగ్గడంతో రూ.1,67,000కి చేరుకుంది. మల్టీ కమాడిటీ ఎక్స్‌ఛేంజ్‌లో మాత్రం బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్స్ 0.88 శాతం అంటే రూ.1062 పెరిగి రూ.1,22,173 ధరలో ట్రేడ్ అవుతోంది. సిల్వర్ డిసెంబర్ ఫ్యూచర్స్ 1.10 శాతం అంటే రూ.1604 పెరిగి రూ.1,47,396కి చేరుకుంది. గ్లోబల్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర తొలిసారి 4000 డాలర్లు దాటి 4017 డాలర్ల దగ్గర, ఔన్స్ వెండి ధర సుమారు 48.4 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది.

గత కొన్ని సంవత్సరాలలో ప్రపంచ ఆర్ధిక పరిస్థితుల మధ్య, బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఇప్పుడు తొలిసారి బంగారం ఉన్సు ధర $4,000 దాటి వెళ్లింది. అమెరికా ఆర్ధిక వ్యవస్థపై ఉన్న ఆందోళనలు, ప్రభుత్వం మూత పడే ప్రమాదం లాంటి పరిస్థితుల వల్ల బంగారం ఈ స్థాయిలో పెరుగుతోంది. ఇది బంగారం ధరల చరిత్రలో ఒక మైలురాయి. కేవలం రెండు సంవత్సరాల క్రితం దీని ధర $2,000 కంటే తక్కువగా ఉండేది.

ఈ సంవత్సరం మొత్తం చూసుకుంటే బంగారం ధర దాదాపు 50 శాతం పెరిగింది. ప్రపంచంలో వ్యాపార ఒప్పందాలు కలవరం, అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ స్వతంత్రతపై సందేహాలు, ఆ దేశ ఆర్ధిక స్థిరత్వం… ఇవి కలసి బంగారానికి గణనీయమైన డిమాండ్ తీసుకువచ్చాయి. అంతే కాకుండా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి భౌగోళిక ఉద్రిక్తతలు కూడా దీనికి తోడయ్యాయి. చాలా దేశాల కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోళ్లు పెంచినట్టుగా సమాచారం.

అమెరికాలో ప్రభుత్వ ఖర్చులకు సంబంధించి సమావేశాలు నిలిచిపోవడం, మార్కెట్లలో భారీ పతనాల భయం ఉన్న నేపథ్యంలో, పెట్టుబడిదారులు తమ డబ్బును సురక్షితంగా ఉంచే మార్గంగా బంగారాన్ని ఎంచుకుంటున్నారు. పైగా, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించే దశను ప్రారంభించడం కూడా బంగారం ధర పెరుగుదలకు సహాయపడింది. వడ్డీ లేని బంగారం ఇలా మార్కెట్లో భారీగా పెరుగుతోంది.

అక్టోబర్ 18న ధంతేరాస్ ఉంది. దీపావళి ముందు వచ్చే ధంతేరాస్ నాడు బంగారం కొనుగోళ్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ధన త్రయోదశి నాడు బంగారం కొంటే శుభమని, లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించడంతో సమానం అని నమ్ముతుంటారు. కానీ బంగారం ధర ఇంతలా పెరిగిపోవడంతో ఈసారి బంగారం కొనుగోళ్లు ఎలా ఉంటాయో చూడాలి.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.