ఈ దేశాల్లో బంగారం ధరలు తక్కువ.. ఎంత వీలైతే అంత కొనేయండి.. మరి దీనిని ఎలా తీసుకురావాలి?

భారత్ లో బంగారంనకు డిమాండ్ విపరీతంగా ఉంటుంది. అందుకే ఇప్పుడు తులం కొందామంటే చుక్కలు కనిపిస్తున్నాయి. శుభకార్యాలు, ఇతర అవసరాలకు బంగారం అవసరం ఉన్నా..


ధరల కారణంగా తక్కువే కొనుగోలు చేస్తున్నారు. అయితే కొన్నిసార్లు బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి.. మళ్లీ అమాంతం పెరుగుతున్నాయి. ఈ తరుణంలో బంగారం ధరలు తక్కువగా ఎక్కడుండే అక్కడ కొనుగోలు చేయాలని చూస్తుంటారు. బంగారానికి భారత్ ఉన్న డిమాండ్ ఇతర దేశాల్లో ఉండదు. దీంతో కొన్ని దేశాల్లో బంగారం ధర తక్కువగా ఉంటుంది. అయితే అక్కడి నుంచి కూడా బంగారం తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. మరి ఎలా తీసుకురావాలి?

భారత్ లో ప్రస్తుతం బంగారం ధరలు.. జూలై 14 ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి రూ.91,550గా నమోదైంది. 24 క్యారెట్ల బంగారం కొనాలంటే రూ.99,880 చెల్లించాలి. అయితే మాలావి, ఇండోనేషియా, థాయిలాండ్, దక్షిణాఫ్రికాతో పాటు అరబ్ దేశాల్లో బంగారం ధరలు తక్కువగా ఉంటాయి. మాలావి దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి రూ.72,460 గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు రూ.79,400 గా ఉన్నాయి. ఇండోనేషియాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,880 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.83,250గా ఉంది. థాయ్ లాండ్ దేశంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,070 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం రూ.90,750 గా ఉంది. దక్షిణాఫ్రికాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.26,397 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,799గా నమోదైంది. ఇక దుబాయ్ లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.93,280గా పలుకుతోంది.

ఆయా దేశాల నుంచి బంగారం ను మనదేశంలోకి తీసుకురావొచ్చు. అయితే ఇందుకు కొన్ని పరిమితులు ఉన్నాయి. విదేశాల నుంచి 20 గ్రాముల బంగారం తన వెంట తీసుకొని రావొచ్చు. మహిళలు ఆభరణాలు అయితే 40 గ్రాముల వరకు మినహాయింపు ఉంటుంది. దుబాయ్ నుంచి భారత్ కు ఎక్కువగా రాకపోకలు సాగుతూ ఉంటాయి. దీంతో ఇక్కడి నుంచి బంగారం ను భారత్ కు తీసుకొస్తూ ఉంటారు. అలాగే థాయ్ లాండ్ కూడా బంగారం విక్రయాలకు ప్రసిద్ధి. ఇక్కడికి వెళ్లిన వారు సైతం బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే బంగారం ను దేశంలోకి బిస్కెట్ల రూపంలో తీసుకురావాలంటే బిల్లులు తప్పనిసరిగా ఉండాలి. పరిమితికి మించిన బంగారం ఉంటే కస్టమ్స్ అధికారులు ఆధీనంలోకి తీసుకుంటారు. ఆభరణాల రూపంలో అయితే బిల్లులు లేకపోయినా పర్వాలేదు.

భారత్ లో బంగారం ధరలు రోజరోజుకు పెరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఎక్కువగా డిమాండ్ ఉండడంతో చాలా మంది వివిధ మార్గాల ద్వారా బంగారం తీసుకువస్తూ ఉంటారు.కానీ ఇలా తేవడం చట్టరీత్యా నేరం. అక్రమంగా బంగారం తీసుకువస్తూ పట్టుబడితే జైలు శిక్ష ఉంటుంది. అందువల్ల అవసరమైన మేరకు మాత్రమే బంగారం తీసుకురావాలి. మీరు ఎప్పుడైనా దుబాయ్ లేదా థాయ్ లాండ్ వెళ్లినప్పుడు బంగారం అనుమతి తో పరిమితుల మేరకు మాత్రమే తీసుకొచ్చే ప్రయత్నం చేయండి..

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.