బంగారం ధర భారీగా పెరుగుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా బంగారం ధర ఆల్‌టైం హైకి చేరింది.. కేవలం ఆరు రోజుల్లోనే దాదాపు రూ.6 వేలు పెరిగింది.. గోల్డ్ రేట్.. ప్రస్తుతం 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర లక్షా ఎనిమిది వేల 490కి చేరింది. అయితే.. బంగారంతోపాటు వెండి ధర కూడా భారీగా పెరిగింది. షేర్ మార్కెట్ నుంచి బులియన్ మార్కెట్‌కు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతుండడంతో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. మరోవైపు రూపాయి బలహీనపడడం వల్ల దిగుమతి ధరపై ప్రభావం చూపిస్తోంది. పండగలు, పెళ్లిళ్ల సీజన్ ఓవైపు.. బంగారం ధర ఇంకా పెరుగుతుందన్న వదంతుల వల్ల డిమాండ్ అమాంతం పెరిగిపోయి ధరలు భగ్గుమంటున్నాయి. మరోవైపు ఈ ఏడాది 42శాతం పెరిగింది వెండి ధర..
కాగా.. దేశీయంగా 07 సెప్టెంబర్ 2025 ఆదివారం బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి..
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,08,490 ఉంది
22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.99,450 గా ఉంది.
వెండి కిలో ధర రూ.1,28,000లుగా ఉంది.
అయితే, ప్రాంతాల వారిగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,08,490 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.99450గా ఉంది. వెండి కిలో ధర రూ.1,38,000 గా ఉంది.
విజయవాడ, విశాఖపట్నంలో 24క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,08,490 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.99450గా ఉంది. వెండి కిలో ధర రూ.1,38,000 గా ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల బంగార ధర 1,08,620, 22 క్యారెట్ల ధర రూ.99600లుగా ఉంది. వెండి కిలో ధర రూ.1,28,000లుగా ఉంది.
ముంబైలో 24 క్యారెట్ల బంగార ధర 1,08,490, 22 క్యారెట్ల ధర రూ.99,450లుగా ఉంది. వెండి కిలో ధర రూ.1,28,000లుగా ఉంది.
చెన్నైలో 24క్యారెట్ల బంగారం ధర రూ.1,09,150 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,00,050గా ఉంది. వెండి కిలో ధర రూ.1,38,000 గా ఉంది.
గమనిక.. బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
































