ఏపీ పెన్షన్‌దారులకు గుడ్‌న్యూస్‌.. ఒక రోజు ముందుగానే పెన్షన్లు

www.mannamweb.com


ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కోసం కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా పెన్షన్‌ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుంటోంది.

ప్రతినెల 1వ తేదీన పెన్షన్‌లను అందించే విధంగా చర్యలు తీసుకుంటోంది. అయితే తాజాగా పెన్షన్‌దారుల కోసం ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ తెలిపింది. ఒక రోజు ముందుగానే పెన్షన్‌లను అందించేందుకు నిర్ణయం తీసుకుంది. అంటే 31న పెన్షన్‌లను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది.

ఎందుకంటే సెప్టెంబర్‌ 1న ఆదివారం సెలవు రోజు కావడంతో ఒక రోజు ఒక రోజు ముందుగానే పెన్షన్లను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. ఏదైనా కారణంగా ఈ నెల 31న పెన్షన్లు అందకపోతే సెప్టెంబర్‌ 2వ తేదీన అందరికి అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాలన పరంగా కీలక నిర్ణయాలు తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటోంది.