ఈ ఆగస్ట్ నెలలో ఏపీలోని విద్యార్థులకు భారీగా సెలవులు రానున్నాయి. దీంతో విద్యార్థులు ఎంజాయ్ చేసే సమయం ఆసన్నమైంది. ఆగస్టు 2025లో ఆంధ్రప్రదేశ్ పాఠశాలలు పండుగలు, ఇతర కార్యక్రమాల సందర్భంగా వరుస సెలవులు లభించనున్నాయి. విద్యా సంవత్సరం గడిచేకొద్దీ..
ఆగస్టు నెల విద్యార్థులు విశ్రాంతి తీసుకోవడానికి అనువైన నెల అనే చెప్పాలి. ఈ నెలలో వరుస సెలవులు వస్తున్నాయి. ఎందుకంటే ఆగస్ట్‌లో రక్షా బంధన్, స్వాతంత్ర్య దినోత్సవ సెలవులు సహా అనేక సెలవులు వస్తాయి. మంచి ప్రణాళికతో, కుటుంబాలు చిన్న పర్యటనలు, లేదా ఇంట్లో విశ్రాంతి సమయం కోసం ఈ విరామాలను అనుకూలంగా ఉండవచ్చు. ఆగస్ట్ నెలలో వరుస సెలవులు వస్తుండటంతో కుటుంబమంతా కలిసి టూర్ వెళ్లేందుకు కూడా ప్లాన్ చేసుకోవచ్చు.ఆగస్టులో భారతదేశం అంతటా చాలా పాఠశాలలు రక్షా బంధన్, స్వాతంత్ర్య దినోత్సవం, జన్మాష్టమి, గణేష్ చతుర్థి వంటి వివిధ సందర్భాలలో ముఖ్యమైన సెలవులను పాటిస్తాయి . ఈ సెలవులతో విద్యార్థులు విశ్రాంతి తీసుకోవడానికి, ఎంజాయ్ చేసేందుకు అద్భుతమైన అవకాశం.
ఈ ఆగస్ట్ నెలలో ఏపీలోని విద్యార్థులకు భారీగా సెలవులు రానున్నాయి. దీంతో విద్యార్థులు ఎంజాయ్ చేసే సమయం ఆసన్నమైంది. ఆగస్టు 2025లో ఆంధ్రప్రదేశ్ పాఠశాలలు పండుగలు, ఇతర కార్యక్రమాల సందర్భంగా వరుస సెలవులు లభించనున్నాయి. విద్యా సంవత్సరం గడిచేకొద్దీ ఏపీలో పాఠశాలలు ఆగస్టు 2025లో అనేక ముఖ్యమైన సెలవులు రానున్నాయి.
ఆగస్టు 2025 ఆంధ్రప్రదేశ్ పాఠశాలలకు సెలవుల జాబితా:
ఆగస్టు నెలలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పాఠశాలలకు గెజిటెడ్ ప్రభుత్వ సెలవులు ఉన్నాయి.
🔹ఆగస్ట్ 8 శుక్రవారం – వరలక్ష్మీవ్రతం
🔹 ఆగస్ట్ 9 శనివారం – రెండో శనివారం సందర్భంగా సెలవు
🔹 ఆగస్ట్ 10 ఆదివారం- దేశ వ్యాప్తంగా పాఠశాలలకు సెలవు
🔹 ఆగస్ట్ 15 శుక్రవారం – స్వాతంత్ర్య దినోత్సవం
🔹 ఆగస్ట్ 16న శనివారం – శ్రీ కృష్ణాష్టమి
🔹 ఆగస్ట్ 17న ఆదివారం – పాఠశాలలకు సెలవు
🔹 ఆగస్ట్ 27న బుధవారం – వినాయక చవితి
ఈ విధంగా ఆదివారాలతో కలుపుకొంటే విద్యార్థులకు వరుస సెలవులు రానున్నాయి.
అలాగే ఆగస్ట్ 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించి విద్యార్థులకు నిర్వహించే కార్యక్రమాలు, ఆటల పోటీలలో నిమగ్నమై ఉంటాయి. అలాగే వేడుకలకు సంబంధించి వివిధ ఏర్పాట్లు చేసుకుంటారు విద్యార్థులు. అంటే ఈ రోజుల్లో కూడా తరగతులు పెద్దగా కొనసాగవు. క్లాసులు వినే ఇబ్బంది ఉండదు. ఈ విధంగా మొత్తం ఆగస్ట్ నెలలో విద్యార్థులకు వరుస సెలవులు వస్తుండటం ఎంజాయ్ వాతావరణం నెలకొంటుంది.
































