ఏపీ మహిళలకు శుభవార్త.. ఒక్కొక్కరికీ రూ.4 లక్షలు.. సీఎం చంద్రబాబు నిర్ణయం

www.mannamweb.com


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెల్లగా సంక్షేమ పథకాలపై ఫోకస్ పెడుతున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే.. కొద్దికొద్దిగా నిధులు రావడం మొదలవుతోంది. మరి తాజాగా సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయమేంటో, అది మహిళలకు ఎలా కలిసొస్తుందో తెలుసుకుందాం.

ఏ రాష్ట్రమైనా పథకాలను అమలు చెయ్యాలంటే.. 2 ప్లాన్లు ఉంటాయి. 1.రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా పథకాలను అమలు చెయ్యడం. 2.కేంద్ర పథకాలను ఉపయోగించుకొని, రాష్ట్రంలో అమలు చెయ్యడం. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ఖజానాలో పెద్దగా మనీ లేదు కాబట్టి.. 2వ ప్లాన్ అమలు చెయ్యాలని అనుకుంటోంది. మరి ఏపీ ప్రభుత్వానికి నచ్చిన కేంద్ర పథకాలు ఏవంటే.. సమమ్, RKVY పథకాలు. ఈ పథకాల ద్వారా ఏపీ ప్రభుత్వం మహిళలకు ఉచితంగా డ్రోన్లను ఇవ్వాలనుకుంటోంది.

జిల్లాల్లో డ్రోన్ల పంపిణీకి ఏపీ వ్యవసాయశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న రాష్ట్రీయ కృషి వికాస యోజన (RKVY), సబ్‌ మిషన్‌ అగ్రికల్చర్‌ మెకానిజమ్‌ (SMAM) స్కీమ్‌ల ద్వారా 40 శాతం సబ్సిడీ లభిస్తుంది. అంటే డ్రోన్ పొందిన ఒక్కో మహిళకూ రూ.4 లక్షల దాకా సబ్సిడీ వస్తుంది. నిజానికి 2022లో గత వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. కానీ ఆదిలోనే అటకెక్కింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెడుతోంది.

ప్లాన్ ఇదే:
కూటమి ప్రభుత్వం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ (SHG)లకు డ్రోన్లు ఇవ్వాలి అనుకుంటోంది. ఈ డ్రోన్ ఒక్కొక్కటీ ధర రూ.10లక్షలు. ఇందులో కేంద్రం రూ.4లక్షలు రాయితీ ఇస్తోంది. అంటే.. ఇంకా రూ.6 లక్షలు కావాల్సి ఉంది. ఇందులో రూ.5లక్షలు బ్యాంకులు రుణం ఇచ్చేలా ఏపీ ప్రభుత్వం చేస్తుంది. మిగతా రూ.1లక్షను SHG ఇవ్వాల్సి ఉంటుంది. DCCBల ద్వారా ప్రభుత్వం ఈ డ్రోన్లను పంపిణీ చేస్తుంది.

డ్రోన్ వల్ల ఏంటి లాభం?
ఇవి మనం రెగ్యులర్‌గా వీడియోలు తీసుకునే డ్రోన్లు కాదు. ఇవి పొలాల్లో పిచికారీ చెయ్యడానికి ఉపయోగపడే భారీ డోన్లు. ఒక్కో డోన్‌లో పది లీటర్ల దాకా పురుగుమందు పడుతుంది. నానో యూరియా, నానో DAPలను ఈ డ్రోన్లు పిచికారీ చెయ్యగలవు. ఇవి చాలా వేగంగా, ఎక్కువ పంటలకు పిచికారీ చేస్తాయి. పైగా.. సమానంగా పిచికారీ చేస్తాయి. ఇంకా మనుషులు పిచికారీ చేస్తే, వారికి అనారోగ్యాలు రాగలవు. అదే ఆ పని డ్రోన్లకు అప్పగిస్తే మంచిదే. పైగా రైతులు 200 లీటర్ల నీటితో పిచికారీ చేస్తే, డ్రోన్ జస్ట్ 10 లీటర్లతోనే పని పూర్తి చేస్తుంది. జస్ట్ 6 నిమిషాల్లోనే ఎకరం పొలానికి పిచికారీ చేస్తుంది.

ట్రైనింగ్ ఇస్తారు:
ఈ డ్రోన్లను నిర్వహించే బాధ్యత స్వయం సహాయక బృందంలోని సభ్యులకు ఉంటుంది. మహిళలే వీటిని నిర్వహిస్తారు. కనీసం ఇంటర్‌ పాసైన వారికి NG రంగా యూనివర్శిటీలో 12 రోజులు ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత డ్రోన్ నడిపే లైసెన్స్ కూడా ఇస్తారు. ఇలా డ్రోన్ పొందిన మహిళలు.. తమ తమ జిల్లాల్లో పొలాలకు పిచికారీ చేస్తూ.. రైతుల నుంచి ఆ పని చేసినందుకు మనీ తీసుకుంటారు. ఇలా వారికి ఉపాధి లభిస్తుంది. అదే సమయంలో రైతులు.. పిచికారీ కోసం కూలీలకు మనీ ఇచ్చే బదులు.. డ్రోన్ నడిపే మహిళకు ఇస్తారు. తద్వారా రైతులకు పిచికారీ ఖర్చులు తగ్గుతాయి. ఇలా ఈ డ్రోన్ స్కీమ్ అందరికీ ఉపయోగపడనుంది.