ఏపీ మహిళలకు గుడ్‌న్యూస్‌.. 18 ఏళ్లు దాటితే రూ. 18 వేలు.. అప్లై చేసుకోండిలా

పీలో టీడీపీ-జనసేన-బీజేపే కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో అతి ముఖ్యమైనది `ఆడబిడ్డ నిధి`. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ. 1500 చొప్పున ఏడాదికి రూ.
18,000 ఆర్థిక సాయం అందిస్తామని ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు హామీ ఇచ్చాయి. అయితే కూటమి అధికారం చేపట్టి ఏడాది అవుతున్న ఈ పథకం అమలు కాకపోవడంతో విపక్ష వైసీపీ విమర్శల దాడి చేస్తుంది. ఈ విమర్శలను ఏమాత్రం పట్టించుకోని కూటమి ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది.


రీసెంట్ గానే తల్లికి వందనం పథకం అమలు చేసింది. ఇదే జూన్ లో రైతు భరోసా డబ్బుల కూడా జమ కానున్నాయి. అలాగే `ఆడబిడ్డ నిధి` పథకం అమలుకు సైతం చంద్రబాబు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే 2024-2025 వార్షిక బడ్జెట్‌లో ఈ పథకం అమలుకు రూ.3,341.82 కోట్లు కేటాయించింది. రాష్ట్ర మహిళకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించడమే ఈ పథకం మొక్క ముఖ్య లక్ష్యం. 18 నుండి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్న మహిళలు ఈ పథకానికి అర్హులు. ఆడబిడ్డ నిధి స్కీమ్‌లో ఎంపికైన లబ్ధిదారులందరికీ నెలకు రూ. 1500 నేరుగా బ్యాంక్ అకౌంట్ లో పడతాయి.

బీపీఎల్ కుటుంబాలకు చెందిన మహిళలు ప్రభుత్వం అందించే ఈ ఆర్థిక సాయాన్ని పొందాలనుకుంటే మీ సమీపంలో ఉన్న మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా ఆఫీసియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్ లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్‌ వివరాలు, వయసు నిర్ధారణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ లో ఆడబిడ్డ నిధి పథకానికి ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ https://ap.gov.in/aadabiddanidhi ను ఓపెన్ చేసి లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత ఆడబిడ్డ నిధి పథకంపై క్లిక్ చేసి.. ఆన్లైన్ ఫారం ఫిల్ చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. చివరిగా అప్లికేషన్ సబ్మిట్ చేసి రిఫరెన్స్ నంబర్ నోట్ చేసుకుంటే సరిపోతుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.