కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో గుడ్ న్యూస్… 8వ పే కమిషన్ నూతన చైర్మన్ నియామకం జరిగేది ఎప్పుడంటే

 కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇటీవల 8వ పే కమిషన్ చైర్మన్ నియామకం పైన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారిక వర్గాల్లో చర్చ నడుస్తోంది. 8వ పే కమిషన్ ప్రకటన చేసి ఇప్పటికే ఆరు నెలలు గడిచినప్పటికీ ఇంకా చైర్మన్ నియామకం జరగలేదు. . ఈ నేపథ్యంలో అతి త్వరలోనే చైర్మన్ నియామకంతో పాటు ఇతర సభ్యులు నియామకం కూడా జరుగుతుందని అంచనా వేస్తున్నారు.

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఉద్యోగులకు త్వరలోనే గుడ్ న్యూస్ వినిపించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా ఎనిమిదవ పే కమిషన్ అతి త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు అధికారిక వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటికే జనవరి నెలలో 8వ పే కమిషన్ ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆరు నెలలు గడిచి ఏడో నెలలోకి అడుగుపెడుతున్నప్పటికీ ఇంకా ఎనిమిదో పే కమిషన్ ఏర్పాటు కాలేదు. అయితే త్వరలోనే ఎనిమిదో పే కమిషన్ ఏర్పాటు చేసే దిశగా కేంద్రం అడుగులు వేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే జరిగినట్లు త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని తద్వారా ఎనిమిదో పే కమిషన్ పనితీరు ప్రారంభం అవుతుందని కూడా వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఎనిమిదవ పే కమిషన్ జూలై నెలలో ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఒకసారి ఎనిమిదో పే కమిషన్ ఏర్పాటు అనంతరం వేతన సవరణ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే ఎనిమిదో పే కమిషన్ చైర్మన్ అలాగే నియామకం గురించి ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ విడుదల చేసిందని మొత్తం 42 మందిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది ఇందులో ఏ కమిషన్ చైర్మన్ పదవితో పాటు ఇద్దరు సభ్యులు అలాగే కన్సల్టెంట్ లా నియామకం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే 8వ పే కమిషన్ ఒకవేళ జూలై నెలలో ఏర్పడినప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు అందజేయడానికి కనీసం 9 నుంచి 12 నెలల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు పంపినప్పటికీ సిఫార్సులు అమలు అవ్వడానికి కనీసం రెండు నుంచి మూడు నెలల సమయం పట్టి అవకాశం ఉందని ఈ లెక్కన చూస్తే 2026 ఆగస్టు నాటికి తప్ప కొత్త వేతన సవరణ సిఫార్సులు అమలులోకి వచ్చే పరిస్థితి లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. నిజానికి నూతన పే కమిషన్ సిఫార్సులు 2026 జనవరి ఒకటో తేదీ నుంచి అమలులోకి రావాల్సి ఉంటుంది. డిసెంబర్ 31వ తేదీ 2025 నాటికి ముగియనున్నాయి. అయితే ఒకవేళ ఆగస్టు వరకు నూతన పే కమిషన్ సిఫార్సులు అమలులోకి రానట్లయితే 2026 జనవరి నుంచి ఆగస్టు వరకు మధ్య కాలాన్ని లెక్క కట్టి ఏరియర్స్ రూపంలో నూతన పే కమిషన్ సిఫార్సుల అమల్లోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు చెల్లించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
గమనిక: 8వ పే కమిషన్ సంబంధించిన సమాచారం కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే గెజిట్ నోటిఫికేషన్ మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.