తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. క్యూ లైన్ లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం

శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ పూర్తిగా తగ్గింది. సోమవారం స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు తక్కువ సంఖ్యలో హాజరయ్యారు.


ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం అవుతోంది. అదేవిధంగా రూ.300 ప్రత్యేక దర్శనానికి (Special Darshan) టోకెన్లు తీసుకున్న భక్తులను నేరుగా దర్శనానికి పంపుతున్నారు. ఇక మంగళవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ (Vaikuntam Que Complex) భక్తులు లేక వెలవెలబోతోంది. సోమవారం స్వామి వారిని 68,298 మంది దర్శించుకున్నారు. అందులో 16,544 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ (Srivari Hundi) ఆదాయం రూ.4.1 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు (TTD Offcials) వెల్లడించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.