రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో వారి ఖాతాల్లోకి రూ.2వేల డబ్బులు పడనున్నాయి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ 19వ విడత నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది.
ఈ నిధులను ప్రధాని మోదీ ఫిబ్రవరి 24వ తేదీన విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ఆరోజున బీహార్ లో పలు వ్యవసాయ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.
అదే సమయంలో పీఎం కిసాన్ నిధులను కూడా విడుదల చేస్తారట. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కింద లబ్దిదారులకు కేంద్రం రూ.6వేలు సాయం అందిస్తోంది. ఏడాదికి 3 విడతల్లో చెల్లింపులు చేస్తోంది. ఒక్కో విడతలో 2వేల రూపాయలు ఖాతాల్లోకి వేస్తున్నారు. కాగా, రైతులకు అలర్ట్. అదేమిటంటే ఈ కేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే ఈ డబ్బులు జమ అవుతాయి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ 18వ విడత నిధులను ప్రధాని మోదీ 2024 అక్టోబర్ 15న విడుదల చేశారు.
పీఎం కిసాన్.. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పథకం. భారత ప్రభుత్వం 100 నిధులు ఇస్తుంది. ఈ స్కీమ్ కింద లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేయబడుతుంది. పథకం కింద ఏడాదికి 6వేల రూపాయలు ఇస్తారు. మూడు సమాన వాయిదాలలో రూ. 2వేలు ఖాతాలలో వేస్తారు. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి భూమిని కలిగి ఉన్న అర్హతగల కుటుంబానికి సంబంధించిన ఆధార్-సీడెడ్ బ్యాంక్ ఖాతాలలో డబ్బు జమ అవుతుంది.
అయితే, ఈ స్కీమ్ కింద అర్హత ఉన్నప్పటికీ.. ఈ కేవైసీ చేయించుకోవాలి. లేదంటే డబ్బులు పడవు.
ఈ కేవైసీ చేసుకోవడానికి ప్రాసెస్..
* ఓటీపీ బేస్డ్ ఈ కేవైసీ (పీఎం కిసాన్ పోర్టల్, మొబైల్ యాప్ లో అందుబాటులో ఉంది)
* బయోమెట్రిక్ బేస్డ్ ఈ కేవైసీ (ఇందుకోసం కామన్ సర్వీస్ పాయింట్స్, రాష్ట్ర సేవా కేంద్రాలకు వెళ్లాలి)
* ఫేస్ అదెన్ సియేషన్ బేస్డ్ కేవైసీ (పీఎం కిసాన్ మొబైల్ యాప్ ద్వారా చేసుకోవచ్చు)
పీఎం కిసాన్ యోజనకు ఎలా రిజిస్ట్రర్ చేసుకోవాలంటే..
* అర్హత ఉన్న వారు ఆధార్ సమర్పించాలి
* సిటిజన్ షిప్ ఆధారం సమర్పించాలి
* సొంత భూమి పత్రాలు కలిగి ఉండాలి
* బ్యాంకు ఖాతా ఉండాలి
* పీఎం కిసాన్ పోర్టల్ కు వెళ్లి ఆన్ లైన్ లో రిజిస్ట్రర్ చేసుకోవాలి
* సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ కు వెళ్లొచ్చు
* రాష్ట్ర ప్రభుత్వ నోడల్ అధికారిని సంప్రదించాలి
* స్థానిక రెవెన్యూ అధికారులను సంప్రదించాలి
పీఎం కిసాన్ స్కీమ్ కు అనర్హులు ఎవరెవరంటే..
* అధిక ఆదాయం వచ్చే వారు అనర్హులు
* రాజ్యంగబద్దమైన పదవుల్లో ఉన్న వారు, మాజీలు
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్ అయిన వారు
* నెలకు 10వేలు అంతకన్నా ఎక్కువ పెన్షన్ అందుకుంటున్న వారు
* ఇన్ కమ్ ట్యాక్స్ పేయర్స్
* డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు, సీఏలు, ఆర్టిటెక్ట్ లు
* సంస్థాగత భూస్వామిలు..