ఏపీలో రైతులకు త్వరలోనే గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికీ రూ.20వేలు.. పథకం పేరు కూడా మార్పు

ఏపీలో అధికారం చేపట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం మరో పథకం పేరు మార్చింది. అధికారంలోకి వచ్చాక పాలనలో ప్రక్షాళన ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం..


ఇప్పటికే అనేక పథకాల పేర్లు మార్చింది. వైసీపీ ప్రభుత్వ హయాంలోని పథకాల పేర్ల స్థానంలో కొత్తవాటిని చేర్చుతోంది. ఇప్పటికే వైఎస్ఆర్ బీమా, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ పెన్షన్ కానుక వంటి పేర్లను మార్చిన ప్రభుత్వం.. తాజాగా మరో పథకం పేరు మార్చింది.

వైఎస్ఆర్ రైతు భరోసా పేరును అన్నదాత సుఖీభవగా మార్చారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వ వెబ్ సైట్‌లో మార్పులు చేశారు. అన్నదాత సుఖీభవ వెబ్ సైట్‌లో సీఎం చంద్రబాబు నాయుడు, వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఫోటోలను ఉంచారు.