భారతీయులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో భారీగా తగ్గనున్న ఈ మొబైల్‌ రీఛార్జ్‌ ధరలు

www.mannamweb.com


భారతదేశ టెలికాం రెగ్యులేటర్ (TRAI) వినియోగదారుల కోసం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రీఛార్జ్‌ చేసుకోవాలంటే డేటాతో పాటు వాయిస్‌, ఎస్‌ఎంఎస్‌లతో కూడిన ప్లాన్స్‌ ఉంటున్నాయి. అది కూడా అధిక ధరలు చెల్లించాల్సి ఉంటుంది. వాయిస్‌, ఎస్‌ఎంఎస్‌లతో కూడి రీఛార్జ్‌ ప్లాన్స్‌ అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో వాయిస్‌, ఎస్‌ఎంఎస్‌లతో కూడిన రీఛార్జ్‌ వోచర్లను అందించాలని ట్రాయ్‌ టెలికాం కంపెనీలకు సూచించింది..

భారతదేశ టెలికాం రెగ్యులేటర్ TRAI, మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు ఇంటర్నెట్ డేటాను కొనుగోలు చేయవలసిన అవసరం లేకుండా వాయిస్ కాల్స్, SMSల కోసం ప్రత్యేకంగా రీఛార్జ్ ప్లాన్‌లను అందించాలనే సూచించింది. ఈ సందర్భంగా టారిఫ్ నిబంధనలను సవరించింది. సోమవారం ప్రకటించిన కొత్త రూల్ ట్వీక్స్, మొబైల్ డేటాను ఉపయోగించని వినియోగదారుల కోసం అనుకూలమైన ఆప్షన్‌లను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ప్రత్యేక రీఛార్జ్ కూపన్‌ల చెల్లుబాటును ప్రస్తుత 90 రోజుల నుండి గరిష్టంగా 365 రోజులకు పొడిగిస్తుంది. అయితే కేవలం వాయిస్, ఎస్ఎంఎస్ లకు మాత్రమే రీఛార్జ్ ప్లాన్స్ అందుబాటులోకి వస్తే ఖర్చు మరింతగా తగ్గనున్నాయి.

ఈ మార్పు ముఖ్యంగా దాదాపు 150 మిలియన్ల 2G వినియోగదారులు, డ్యూయల్ సిమ్ యజమానులు, వృద్ధులు, గ్రామీణ నివాసితులకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. ఈ చర్య వినియోగదారులు ఉపయోగించని డేటాపై అదనపు ఖర్చు చేయకుండా, వారికి అవసరమైన సేవలకు మాత్రమే చెల్లించడానికి అనుమతిస్తుంది. TRAI ప్రకారం.. టెలికాం ఆపరేటర్ల నుండి వచ్చిన డేటా ప్రకారం, భారతదేశంలో దాదాపు 150 మిలియన్ల మంది చందాదారులు ఇప్పటికీ ఫీచర్ ఫోన్‌లపై ఆధారపడుతున్నారని తెలిపింది.

సర్వీస్ ప్రొవైడర్ 365 రోజులకు మించని వ్యవధితో వాయిస్, SMS కోసం ప్రత్యేకంగా కనీసం ఒక ప్రత్యేక టారిఫ్ వోచర్‌ని అందిస్తారని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) టెలికాం వినియోగదారుల రిపోర్ట్‌లో సూచించింది. TRAI ప్రయత్నం వినియోగదారులకు ప్రాధాన్యత ఇస్తుండగా, వినియోగదారులను 2G నుండి 4G లేదా 5Gకి మార్చడానికి రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వీ వంటి కంపెనీలకు అడ్డంకిగా మారుతుంది. అదేవిధంగా, జియో, ఎయిర్‌టెల్‌ కంపెనీలు మెరుగైన ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు తన 2G వినియోగదారులను 4Gకి మారుస్తోంది. ఇందులో భాగంగా వోడాఫోన్‌ ఐడియా తన 4G నెట్‌వర్క్ విస్తరణను కూడా వేగవంతం చేస్తోంది.