ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ కట్టడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. అందులోనూ హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు. కానీ, ఇప్పటికీ చాలా మంది కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఇన్సూరెన్స్ ప్రీమియం ఎక్కువగా ఉందని చాలా మంది తీసుకోవడం లేదు. ఈ క్రమంలో ఇన్సూరెన్స్ పాలసీలపై కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పనుందని సమాచారం తెలుస్తుంది. ఇక ఆ గుడ్ న్యూస్ ఏంటి? కేంద్రం నుంచి మనకు కలిగే బెనిఫిట్స్ ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
GST పూర్తిగా ఎత్తివేయడం లేదా తక్కువ స్థాయికి తగ్గించడం వంటివి చేయాలని కేంద్రం వద్దకు ఎన్నో ప్రతిపాదనలు చేరాయి. ఈ విషయంపై గత కొద్ది నెలల నుంచి అనేక చర్చలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలపై జీఎస్‌టి పూర్తిగా ఎత్తివేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుందన్న సమాచారం బలంగా వినిపిస్తుంది.జీఎస్‌టీ కౌన్సిల్ మీటింగ్ డిసెంబర్ 21, 22 తేదీల్లో జరగనుంది. ఈ మీటింగ్ లో పలు ఇన్సూరెన్స్ పాలసీలపై జీఎస్‌టీ పూర్తిగా ఎత్తివేయడం లేదా తగ్గించడం పై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలపై ప్రస్తుతం పడుతున్న 18 శాతం జీఎస్‌టీని పూర్తిగా తొలగిస్తూ జీఎస్‌టీ కౌన్సిల్ డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉందని సమాచారం. అలాగే 60 ఏళ్ల వయసు పైబడిన సీనియర్ సిటిజన్లు రూ.5 లక్షల లోపు కవరేజీతో తీసుకునే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలపైనా కంప్లీట్ గా టాక్స్ ని తీసేయవచ్చని తెలుస్తుంది.
అలాగే ఇతర జీఎస్‌టీ రేట్లలోనూ మార్పులు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. రాబోయే 2025లో కేంద్రం తీసుకున్న నిర్ణయాలు అమలు కావొచ్చని సమాచారం. ఇన్సూరెన్స్ లపై మాత్రమే కాకుండా పలు అత్యవసర వస్తువులపై కూడా జీఎస్‌టీ తగ్గించే అవకాశాలు కనిస్తున్నాయి. ఇంకా అలాగే లగ్జరీ గూడ్స్‌పై జీఎస్‌టీ పెంచవచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి. అయితే, డిసెంబర్‌లో జరిగే మీటింగ్ లో వీటిపై కచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారో లేదో చెప్పలేం అని అంటున్నారు నిపుణులు. కానీ పలు ఇన్సూరెన్స్ టాక్స్ లపై మాత్రం కేంద్రం కచ్చితంగా ఏదో ఒక మంచి నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. దీంతో కేంద్రం సరైన నిర్ణయం తీసుకుంటే కనుక ఇన్సూరెన్స్ కట్టే వారికి టాక్స్ బెనిఫిట్స్ కచ్చితంగా ఉంటాయి.