రిలయన్స్ జియో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టెలికాం రంగంలో ఇది ఓ సంచలనంగా నిలిచింది. టెలికాం సెక్టార్ లోకి ఎంట్రీ ఇవ్వడంతోనే ఉచిత డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం కల్పిస్తూ.. అందరినీ ఆకట్టుకుంటుంది. అన్నిటెలికాం సంస్థలను తన బాటలో పయణించేలా చేయడంలో జియో సక్సెస్ అయింది. ఇక ఇటీవలే జియో.. తన రీఛార్జ్ ప్లాన్స్ ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జూలై నుంచే పెరిగిన రేట్లు అమల్లోకి వచ్చాయి. జియో బాటలోనే ఎయిర్‌టెల్, వీఐ కూడా పయనిస్తూ.. రీఛార్జ్ ప్లాన్స్ రేట్లను పెంచాయి. దీంతో వినియోగదారులు బాగా అసంతృప్తిగా ఉన్నారు. ఇదే సమయంలో ప్రముఖ వ్యాపార వేత్త అయినా గౌతమ్ అదానీ కూడా టెలికాం రంగంలోకి వస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జియో తన యూజర్లకు అదిరిపోయే న్యూస్ చెప్పింది. గతంలో తీసేసిన పాపులర్ ప్లాన్లను తిరిగి ప్రారభించనుంది. మరి… ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ప్రముఖ వ్యాపార వేత్త, ఆసియా కుబేర్లులో ఒకరు గౌతమ్ అదానీ తర్వలో టెలికాం సెక్టార్ లోకి అడుగు పెట్టనున్నారు. ఆయనతో పాటు మరికొందరు టాప్ బిబిజినెస్ మెన్లు ఈ సర్వీసెల్ లోకి అడుగుపెతురున్నారనే వార్తలు వినిపిస్తోన్నాయి. దీంతో టెలికాం రంగంలో జియోకు గట్టి పోటీ ఎదురుకావడం ఖాయమని పలువురు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే జియో తన కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను అందించింది. తన యూజర్ల కోసం కొన్ని పాత రీచార్జ్ ప్లాన్లను పునరుద్ధరించింది. రూ.299, రూ.249, రూ. 209, రూ.199 వంటి ప్లాన్లను తిరిగి ప్రారంభించింది.
రూ.299 రీఛార్జ్ ప్లాన్ తో 28 రోజుల కాలపరిమితితో రోజుకు 1.5 జీబీ నెట్ తో మొత్తం 42 జీబీ లభిస్తుంది. అలానే రూ.249 రీఛార్జ్ ప్లాన్ తో 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1జీబీ డేటాతో మొత్తం 28 జీబీ అందించనుంది. అదే విధంగా రూ.209 ప్లాన్ తో 22 రో జులు, 1జీబీ , మొత్తం 22జీబీ డేటా అందనుంది. ఇక చివరి ప్లాన్ అయినా రూ.199 రీఛార్జ్ తో 18 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5 జీబీడేటాతో మొత్తం 27 జీబీ లభించనుంది. ఇక ఈ అన్ని ప్లాన్లలోనూ జియో ఎంటర్ టైన్మెంట్ సర్వీస్ లభిస్తుంది. అయితే ఇదే సమయంలో ఓ రెండు ప్లాన్ ల విషయంలో కూడా జియో కీలక నిర్ణయం తీసుకుంది.
జియోలో ఎంతో పాపురల్ అయిన అన్‌లిమిటెడ్ 5 జీ ప్లాన్స్ రూ .395, రూ .1,559 ప్రీపెయిడ్ ప్లాన్లే అని చెబుతారు. చాలా మంది వీటినే రీఛార్జ్ చేసుకుంటారు. అయితే తాజాగా జియో ఈ ప్రిపెయిడ్ ప్లాన్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించి ఇచ్చింది. ఈ నిర్ణయం చాలా మంది జియో ప్రీ పెయిడ్ వినియోగదారులను నిరాశపరిచిందనే చెప్పొచ్చు. మొత్తంగా కొన్ని పాత పాన్లను పునరుద్దరించి.. తన యూజర్లకు గుడ్ న్యూస్ అందించింది.