భారతీయ మార్కెట్‌లోని వినియోగదారుల కోసం గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ప్రారంభించింది. కొత్త పిక్సెల్ సిరీస్‌ను ప్రారంభించిన వెంటనే, కంపెనీ మునుపటి రెండు సిరీస్‌ల ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ల ధరలను తగ్గించింది.
అంటే ఇప్పుడు మీరు Pixel 8, Pixel 8a, Pixel 8 Pro, Pixel 7aలను కొనుగోలు చేయడానికి తక్కువ డబ్బును ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ నాలుగు మోడళ్ల ధరను కంపెనీ రూ.7 వేలు తగ్గించింది. ఏ మోడల్ ధర ఎంత తగ్గింది? ఇప్పుడు ఈ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయడానికి మీరు ఎంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుందో తెలుసుకుందాం.
భారతదేశంలో Google Pixel 8 ధర:
ఈ Pixel ఫోన్ 128 GB స్టోరేజ్ వేరియంట్ రూ.75,999 ధరతో విడుదల చేసింది. అయితే ఇప్పుడు ఈ ఫోన్ ధర రూ.4 వేలు తగ్గింది. ధర తగ్గింపు తర్వాత ఇప్పుడు మీరు ఈ ఫోన్‌ను రూ.71,999కి కొనుగోలు చేయవచ్చు. 256 GB స్టోరేజ్ వేరియంట్ రూ.82,999కి విడుదల చేసింది. ఈ వేరియంట్ ధర రూ.5 వేలు తగ్గింది. రూ. 5,000 తగ్గింపు తర్వాత, మీరు ఇప్పుడు ఈ వేరియంట్‌ని రూ.77,999కి పొందుతారు.
భారతదేశంలో Google Pixel 8a ధర
ఈ Pixel ఫోన్ 128GB వేరియంట్ 52,999 రూపాయలకు విడుదల అయ్యింది. అయితే ఇప్పుడు ఈ వేరియంట్ ధర 3 వేల రూపాయలు తగ్గించబడింది. రూ. 3,000 తగ్గింపు తర్వాత మీరు ఇప్పుడు రూ. 49,999కి 128 జీబీ వేరియంట్‌ను పొందుతారు. 256 GB వేరియంట్ రూ. 59,999కి లాంచ్ చేయబడింది. కానీ ఇప్పుడు మీరు ఈ వేరియంట్‌ను రూ. 56,999కి పొందుతారు. అంటే ఈ వేరియంట్ ధర కూడా రూ.3 వేలు తగ్గింది.
భారతదేశంలో Google Pixel 8 Pro ధర
ఈ ఫోన్ 128GB/256GB వేరియంట్ ధర కూడా తగ్గించింది కంపెనీ. 128GB వేరియంట్ రూ. 1,06,999కి బదులుగా రూ.99,999కి అందుబాటులో ఉంటుంది. అయితే 256GB వేరియంట్ రూ.1,13,999కి బదులుగా రూ.1,06,999కి అందుబాటులో ఉంటుంది. రెండు వేరియంట్ల ధర రూ.7 వేలు తగ్గింది.
భారతదేశంలో Google Pixel 7a ధర
ఫ్లాగ్‌షిప్ ఫీచర్‌లతో వస్తున్న ఈ పిక్సెల్ ఫోన్ రూ.43,999కి లాంచ్ చేయబడింది. అయితే ఇప్పుడు ఈ వేరియంట్‌ని రూ.41,999కి సులభంగా పొందొచ్చు అంటే రూ.2 వేల ఆదా అవుతుంది.