దేశాన్ని పర్యావరణ హితంగా, కాలుష్య రహితంగా మార్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా కొంతకాలం క్రితం కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ బంకుల్లో ఇథనాల్ కలిపిన పెట్రోల్ ని విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటి దాకా అది పూర్తిగా అమలవ్వలేదు. ఇథనాల్ అనేది ఇథైల్ ఆల్కహాల్. చక్కెరను పులియబెట్టడం వలన ఇది వస్తుంది. అయితే త్వరలో మనకు ఇథనాల్ కలిపిన పెట్రోల్ అంబాటులోకి వస్తుంది. అయితే దీన్ని ముందుగా టూవీలర్ల కోసం అందుబాటులోకి తీసుకు రానున్నట్లు తెలుస్తుంది. దీంతో టూ వీలర్లకు తక్కువ ధరకే పెట్రోల్ లభిస్తుంది.
కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రకారం చమురు కంపెనీలు ఇథనాల్ కలిపిన పెట్రోల్ ని విక్రయించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని చాలా ఏళ్లైనా కానీ ఇప్పటి దాకా అమలు చేయలేదు. ఎందుకంటే ఇథనాల్ కలిపిన పెట్రోల్ సురక్షితమా? కాదా? వీటి వలన వాహనాలు దెబ్బ తింటాయా? వంటి అంశాలను పరిశీలించారు. ఈ పరిశీలన తరువాత ఈ కొత్త పెట్రోల్‌కి కేంద్ర పెట్రోలియం, సహజ ఇంధనశాఖ అన్ని అనుమతులని జారీ చేసింది. ఇక ఈ కొత్త రకం పెట్రోల్‌ని ఫ్లెక్స్ ఫ్యూయల్ అని పిలుస్తారు. ఇందులో పెట్రోల్‌తో పాటుగా ఇథనాల్ లేదా మిథనాల్ మిక్స్ చేస్తారు. అయితే పెట్రోల్ అంత ఎక్కువగా కలపరు. లీటర్ పెట్రోల్‌లో కేవలం 20 శాతం ఇథనాల్ ని మాత్రమే కలుపుతారు.
2025వ సంవత్సరానికల్లా ఇథనాల్ 50 శాతం కలిపేలా సన్నాహాలు జరుపుతున్నారు. ప్రస్తుతానికి మనకు కేవలం 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ మాత్రమే అందుబాటులోకి వస్తుంది. మనకు ఈ కొత్త పెట్రోల్ జియో-బీపీ పెట్రోల్ బంకుల్లో అందుబాటులోకి వస్తుంది. ప్రభుత్వ పెట్రోల్ బంకులు కూడా ఫ్లెక్స్ పెట్రోల్ ని అందుబాటులోకి తీసుకొచ్చేనందుకు ప్రయత్నిస్తున్నాయి. దీని వలన మనకు పెట్రోల్ రేట్లు తగ్గుతాయి. లీటర్ పెట్రోల్ ధర రూ.110 అయితే లీటర్ ఇథనాల్ ధర రూ.55 వరకు ఉంటుంది. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపడం ద్వారా అప్పుడు పెట్రోల్ ధర రూ.88 అవుతుంది. దీంతో రాబోయే రోజుల్లో పెట్రోల్ ఖర్చు తక్కువ అవుతుంది.