సంక్రాంతి రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ అదనపు రైళ్లను నడుపుతోంది. సికింద్రాబాద్-విశాఖపట్నం, విశాఖపట్నం-పార్వతీపురం, సికింద్రాబాద్- బ్రహ్మపూర్, హైదరాబాద్-కటక్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
సికింద్రాబాద్-విశాఖపట్నం ప్రత్యేక రైళ్లు
1. సికింద్రాబాద్ నుంచి బయలురేదే రైలు నెంబర్ 07097 సికింద్రాబాద్ – విశాఖపట్నం స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు జనవరి 5 నుంచి జనవరి 12 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సికింద్రాబాద్‌లో ఆదివారాల్లో సాయంత్రం 4:35 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సోమవారం ఉదయం 5:47 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
2. విశాఖపట్నం నుంచి బయలుదేరే రైలు నెంబర్ 07098 విశాఖపట్నం-సికింద్రాబాద్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు జనవరి 6 నుంచి జనవరి 13 అందుబాటులో ఉంటుంది. ఈ రైలు విశాఖపట్నంలో సోమవారాల్లో రాత్రి 7:50 గంటలకు మరుసటి రోజు మంగళవారం ఉదయం 11:15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
ఈ రెండు ప్రత్యేక రైళ్లకు సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లె, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. ఈ రెండు రైళ్లలో సెకెండ్ ఏసీ-2, థర్డ్ ఏసీ-6, స్లీపర్ క్లాస్ కోచ్‌లు-7, జనరల్ సెకండ్ క్లాస్-3, సెకండ్ క్లాస్ కమ్ లగేజీ/ దివ్యాంగులు -1, మోటార్ కార్-1 కోచ్ ఉంటాయి.
విశాఖపట్నం- పార్వతీపురం ప్రత్యేక రైళ్లు
1. విశాఖపట్నం నుంచి బయలుదేరే రైలు నెంబర్ 08565 విశాఖపట్నం-పార్వతీపురం ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు జనవరి 10 నుంచి జనవరి 20 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు విశాఖపట్నంలో ఉదయం 10 గంటలకు బయలుదేరుతుంది. ఉదయం 10.58 గంటలకు విజయనగరం, 11.55 గంటలకు బొబ్బిలి, మధ్యాహ్నం 12.20 గంటలకు పార్వతీపురం చేరుకుంటుంది.
2. పార్వతీపురంలో నుంచి బయలుదేరే రైలు నెంబర్ 08566 పార్వతీపురం-విశాఖపట్నం ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు జనవరి 10 నుంచి జనవరి 20 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు పార్వతీపురం మధ్యాహ్నం 12.45 గంటలకు బయలుదేరుతుంది. మధ్యాహ్నం 1.10 గంటలకు బొబ్బిలి, మధ్యాహ్నం 2.10 గంటలకు విజయనగరం, సాయంత్రం 4 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
ఈ రెండు రెళ్లు విశాఖపట్నం-పార్వతీపురం మధ్య సింహాచలం, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, గజపతినగరం, కోమటిపల్లె, డొంకినవలస, బొబ్బిలి, సీతానగరం రైల్వే స్టేషన్లలో ఆగుతోంది. ఈ రైలుకు ఎనిమిది మెము కోచ్‌లు ఉంటాయి.
సికింద్రాబాద్- బ్రహ్మపూర్ స్పెషల్ రైళ్లు
1. సికింద్రాబాద్‌లో బయలుదేరే రైలు నెంబర్ 07027 సికింద్రాబాద్ – బ్రహ్మపూర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు జనవరి 3 నుంచి జనవరి 10 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సికింద్రాబాద్‌లో శుక్రవారం రాత్రి 8:15 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు శనివారం మధ్యాహ్నం 2:45 గంటలకు బ్రహ్మపూర్ చేరుకుంటుంది.
2. బ్రహ్మపూర్‌లో బయలుదేరే రైలు నెంబర్ 07028 బ్రహ్మపూర్ – సికింద్రాబాద్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు జనవరి 4 నుంచి జనవరి 11 వరకు అందుబాటులో ఉటుంది. రైలు బ్రహ్మపూర్‌లో శనివారం సాయంత్ర 4:45 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు ఆదివారం ఉదయం 11:35 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
ఈ రెండు రైళ్లు సికింద్రాబాద్-బ్రహ్మపూర్ మధ్య నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లె, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, శ్రీకాకుళం రోడ్డు, నౌపడ, పలాస, సోంపేట, ఇచ్చాపురం రైల్వే స్టేషన్‌లో ఆగుతుంది. ఈ రెండు రైళ్లలో సెకెండ్ ఏసీ-2, థర్డ్ ఏసీ-6, స్లీపర్ క్లాస్ కోచ్‌లు-7, జనరల్ సెకండ్ క్లాస్-3, సెకండ్ క్లాస్ కమ్ లగేజీ/ దివ్యాంగజన్ -1, మోటార్ కార్-1 కోచ్ ఉంటాయి.
హైదరాబాద్ – కటక్ స్పెషల్ రైళ్లు
1. హైదరాబాద్‌లో బయలుదేరే రైలు నెంబర్ 07165 హైదరాబాద్-కటక్ ప్రత్యేక రైలు జనవరి 7 నుంచి జనవరి 21 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు హైదరాబాద్‌లో మంగళవారం రాత్రి 8.10 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు బుధవారం సాయంత్రం 5.45 గంటలకు కటక్ చేరుకుంటుంది.
2. కటక్‌లో బయలుదేరే రైలు నెంబర్ 07166 కటక్-హైదరాబాద్ ప్రత్యేక రైలు జనవరి 8 నుంచి జనవరి 22 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు కటక్‌లో బుధవారం రాత్రి 10:30 గంటలకు కటక్‌లో బయలుదేరుతుంది. మరుసటి రోజు గురువారం రాత్రి 9 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.
ఈ రెండు రైళ్లు హైదరాబాద్-కటక్ మధ్య సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మాపూర్, ఖుర్దా రోడ్, భువనేశ్వర్ రైల్వే స్టేషన్‌లో ఆగుతోంది. ఈ రెండు రైలులో సెకెండ్ ఏసీ-4, థర్డ్ ఏసీ-8, స్లీపర్-6, జనరల్ క్లాస్-2, జనరేటర్ మోటార్ కార్లు-2 కోచ్‌లు ఉంటాయి.