సంక్రాంతి శుభవార్త.. అకౌంట్లలో రూ.5,000 జమ

సంక్రాంతి పండుగ సందర్భంగా వాట్సాప్ గ్రూపుల్లో ఒక అనుమానాస్పద లింక్ వేగంగా వైరల్ అవుతోంది. “PhonePe పొంగల్ గ్రాండ్ గిఫ్ట్ ప్రోగ్రామ్ – అందరు వినియోగదారులకూ రూ.5000 నగదు” అంటూ డబ్బు ఆశ చూపిస్తూ ఓ లింక్‌ను విపరీతంగా షేర్ చేస్తున్నారు.


మొదట నకిలీ అనుకున్నాను కానీ నిజంగా నాకు రూ.5000 వచ్చాయి, మీరు కూడా ట్రై చేయండి” అంటూ మోసపూరిత మెసేజ్‌లు పంపుతున్నారు. కానీ ఇది పూర్తిగా ఫేక్ స్కామ్! ఈ లింక్‌ను ఓపెన్ చేస్తే చాలామందికి ‘404 ఎర్రర్’ కనిపిస్తోంది. కొందరికి ఫిషింగ్ పేజీ ఓపెన్ అయి వ్యక్తిగత వివరాలు, OTP, UPI పిన్ అడుగుతోంది.

సైబర్ నిపుణులు, పోలీసు శాఖలు ఈ మోసానికి సంబంధించి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాయి. ఫోన్‌పే అధికారికంగా “పొంగల్ గ్రాండ్ గిఫ్ట్ ప్రోగ్రామ్” పేరుతో రూ.5000 ఇస్తున్నట్టు ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఫోన్‌పే కంపెనీ తరచూ ఒక విషయం చెబుతోంది. తాము ఎప్పుడూ తెలియని లింకుల ద్వారా ఆఫర్లు ఇవ్వట్లేదని చెబుతోంది. OTP లేదా UPI పిన్ కూడా ఎప్పుడూ అడగము అంటోంది. అధికారిక ఆఫర్లు కేవలం ఫోన్‌పే యాప్‌లోనే కనిపిస్తాయి.

ఈ లింక్ ఎందుకు ప్రమాదకరం?:
చివరలో .xyz, .top వంటి అనుమానాస్పద డొమైన్‌లు ఉంటాయి. నమ్మదగిన కంపెనీలు ఇలాంటి డొమైన్‌లు ఉపయోగించవు.
లింక్ ఓపెన్ చేసిన వెంటనే మొబైల్ నంబర్, OTP, బ్యాంక్ డిటెయిల్స్, UPI పిన్ అడిగే పేజీకి రీడైరెక్ట్ అవుతుంది.
అడిగిన సమాచారాన్ని మీరు ఇస్తే, సైబర్ నేరస్థులు మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ చేయవచ్చు లేదా ఫోన్‌ను హ్యాక్ చేయవచ్చు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా ఇలాంటి మోసాలతో లక్షల రూపాయలు నష్టపోయిన కేసులు నమోదయ్యాయి.

ఇలాంటి స్కామ్‌లతో వచ్చే ప్రమాదాలు:
• బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బును డైరెక్ట్‌గా హ్యాకర్లు దొంగిలిస్తారు.
• మొబైల్ ఫోన్ పూర్తిగా హ్యాక్ చేయగలరు.
• వ్యక్తిగత సమాచారమైన ఆధార్, పాన్, ఫొటోలు, వీడియోలను దుర్వినియోగం చేస్తారు హ్యాకర్లు.
• భవిష్యత్తులో మరిన్ని సైబర్ నేరాల్లో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంటుంది.

సంక్రాంతి, పొంగల్ వంటి పండుగల సమయంలో ఇలాంటి మోసాలు ఎక్కువగా తెరపైకి వస్తాయి. గతంలో కూడా దీపావళి, న్యూ ఇయర్ సమయంలో ఇలాంటి ఫేక్ గిఫ్ట్ లింకులు వైరల్ అయ్యాయి. పండుగ ఉత్సాహంలో ఉన్న ప్రజలు.. డబ్బుపై ఆశతో లింకులు ఓపెన్ చేస్తారని సైబర్ నేరస్థులు అంచనా వేస్తున్నారు. కానీ మనం వాళ్లకు షాక్ ఇస్తూ.. “నేను లింక్ క్లిక్ చెయ్యనుగా”.. అనుకోవాలి.

ప్రజలు తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు:
✔️ డబ్బులు ఇస్తామని చెప్పే ఏ అనధికారిక లింకునూ క్లిక్ చేయవద్దు.
✔️ తెలియని మెసేజ్‌ల నుంచి వచ్చిన లింకులకు OTP, UPI పిన్, బ్యాంక్ డిటెయిల్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకండి.
✔️ అలాంటి మెసేజ్‌లను ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దు – మనం అలా చేస్తే మరింత మంది మోసపోగలరు.
✔️ ఫోన్‌పే యాప్‌లోనే అధికారిక ఆఫర్లు చెక్ చేసుకోండి.
✔️ సందేహం వస్తే, ఫోన్‌పే కస్టమర్ కేర్ (1800-120-3333)కు లేదా అధికారిక వెబ్‌సైట్‌కు సంప్రదించండి.

ఇప్పటికే లింక్ క్లిక్ చేసి డిటెయిల్స్ ఇచ్చారా? వెంటనే ఇలా చేయండి:
బ్యాంక్ పాస్‌వర్డ్, UPI పిన్ వెంటనే మార్చండి.
మీ బ్యాంక్ కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేయండి.
సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు కాల్ చేయండి లేదా www.cybercrime.gov.inలో ఫిర్యాదు నమోదు చేయండి.
ఫోన్‌లో అనవసరమైన పర్మిషన్లు ఆఫ్ చేయండి.

డబ్బు సులభంగా వచ్చేస్తుందని చెప్పే ఆఫర్లు ఎప్పుడూ నమ్మొద్దు. జాగ్రత్తే భద్రత, అవగాహనే రక్షణ. కనుమ పండుగను సంతోషంగా జరుపుకుందాం. సైబర్ మోసగాళ్లకు చెక్ పెడదాం.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.