స్ల్పెండర్ బైక్ ఉన్నవారికి గుడ్ న్యూస్.. RTO కీలక నిర్ణయం

ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ హీరోకు చెందిన స్ల్పెండర్ బైక్ లు విపరీతమైన ఆదరణ పొందాయి. నగరాలు, పల్లెటూర్లు అనే తేడాలేకుండా ఈ బైక్ లను వినియోగిస్తుంటారు. ధర తక్కువ ఉండడంతో ఈ బైక్ లను రైతులు, చిరుద్యోగులు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అంతేకాదు స్ల్పెండర్ బైక్ ఎక్కువ మైలేజీ ఇవ్వడంతో మిగతా బైకులకంటే ఈ బైక్ ల సేల్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఇప్పటికి దేశ వ్యాప్తంగా నిత్యం వందల బైక్ లు అమ్ముడవుతుంటాయి. సామాన్యుడి బైక్ గా పేరుగాంచిన ఈ స్ల్పెండర్ బైక్ మీ దగ్గర ఉందా? అయితే పాత స్ల్పెండర్ బైక్ లు కలిగి ఉన్నవారికి అదిరిపోయే గుడ్ న్యూస్. ఆర్టీవో కీలక నిర్ణయం తీసుకుంది.


ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను రూపొందించి మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. పెట్రోల్ ధరలు అధికంగా ఉండడంతో ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు వాహనదారులు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో పాత స్ల్పెండర్ బైక్ లను కలిగిన వారికి ఆర్టీవో శుభవార్తను అందించింది. ఈ బైక్ లను ఎలక్ట్రిక్ వేరియంట్ గా మార్చుకునే సౌకర్యాన్ని కల్పించింది. ఈవీగా మార్చుకునేందుకు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సిన పనిలేదు. దీనికోసం గోగోఏ1 సంస్థ పూర్తి సపోర్ట్ చేస్తుంది. అధిక సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్, కంట్రోలర్ యూనిట్ ఇతర అవసరమైన వైరింగ్ భాగాలను ఇది అందించనుంది.

కాగా పెట్రోల్ తో నడిచే స్ల్పెండర్ బైక్ లను ఈవీలుగా మార్చుకున్న తర్వాత రోడ్లపై తిరిగేందుకు ఆర్టీవో అనుమతిచ్చింది. దీంతో వాహనదారులకు చట్టపరంగా ఏవిధమైన ఇబ్బందులు తలెత్తవు. స్ల్పెండర్ ను ఈవీగా మార్చుకున్న తర్వాత సింగిల్ ఛార్జ్ తో 151 కి.మీల దూరం వరకు ప్రయాణించొచ్చు. అంటే దూర ప్రయాణాలకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే పాత స్ల్పెండర్ ను ఈవీగా మార్చుకునేందుకు రూ. 35 వేలు ఖర్చు అవుతుంది. పెట్రోల్ ఖర్చులు తగ్గించుకోవాలంటే స్ల్పెండర్ బైక్ ను ఈవీగా మార్చుకుంటే ఆర్థిక భారం తప్పుతుందంటున్నారు నిపుణులు.