శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. 2,3 గంటల్లోనే సర్వదర్శనం పూర్తి అయ్యేలా చర్యలు

www.mannamweb.com


తిరుమలలో కొత్తగా ఏర్పడి టీటీడీ పాలకమండలి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాలకమండలిలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ చైర్మన్ బీఆర్‌.

నాయుడు వెల్లడిస్తూ.. శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పారు. శ్రీవారి దర్శనం కోసం సర్వ దర్శనంలో వెళ్ళే భక్తులు తక్కువ సమయంలోనే దర్శనం చేసుకునే విధంగా సరికొత్త విధానం తీసుకుని రానున్నామని చెప్పారు. ఇకపై పవిత్ర క్షేత్రం తిరుమలలో రాజకీయాలు మాట్లాడటంపై నిషేధం అని చెప్పారు. ఎవరైనా అతిక్రమిస్తే కేసులు పెడతామని చెప్పారు. అంతేకాదు తిరుమలలో అతిథి గృహాలకు సొంతపేర్లు పెట్టరాదన్నారు. తిరుమలలో శారదాపీఠం పూర్తిగా నిబంధనలు అతిక్రమించింది.. కనుక విశాఖ శారదాపీఠం లీజు రద్దు చేసి స్థలాన్ని తిరిగి తీసుకుంటామని శారదాపీఠం భవనాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు బి.ఆర్‌.నాయుడు స్పష్టం చేశారు.

అన్యమత ఉద్యోగుల సేవలకు చెక్‌ – శ్రీవాణి ట్రస్ట్ అకౌంట్ రద్దు

ఎప్పటి నుంచి పవిత్ర పుణ్య క్షేత్రం తిరుమలలో ఇతర అన్యమతస్థులతో మాట్లాడినట్లు చెప్పారు. టీటీడీలో పనిచేసే అన్యమత ఉద్యోగులను ప్రభుత్వానికి బదిలీ చేస్తామని లేదా..వీఆర్‌ఎస్ ఇస్తాం అని టీటీడీ ఛైర్మన్ స్పష్టం చేశారు. శ్రీవాణి ట్రస్టు పేరు రద్దు చేస్తున్నట్లు.. శ్రీవాణి ట్రస్ట్ అకౌంట్‌ను ఆలయ ప్రధాన ఖాతాకే అనుసంధానం చేస్తామని వెల్లడించారు. మరోవైపు తిరుపతి ఫ్లైఓవర్‌ శ్రీనివాస సేతుకు గరుడ వారధి పేరు పునరుద్ధరణ చేస్తున్నట్లు ప్రకటించారు. తిరుపతిలో ముంతాజ్ హోటల్‌ నిర్మాణానికి ఇచ్చిన అనుమతి రద్దు చేస్తున్నట్లు హోటల్ కి ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకుంటామని తెలిపారు. తిరుమల టూరిజం కేంద్రం కాదు.. ఆధ్యాత్మిక కేంద్రం హిందువుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని తిరుమలలో పర్యాటకానికి సంబంధించిన కార్యకలాపాలన్నీ రద్దు చేస్తున్నట్లు బీఆర్. నాయుడువెల్లడించారు.