విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 3 రోజుల పాటు పాఠశాలలకు సెలవు

www.mannamweb.com


విద్యార్థులకు దసరా సెలవులు ముగిశాయి. తాజాగా విద్యార్థులకు శుభవార్త అందించారు అధికారులు. విద్యార్థులకు మూడు రోజుల పాటు సెలవులను ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు పలు జిల్లాల అధికారులు.

ఏపీలోని పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి సహా 13 జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు సెలవులు రానున్నాయి. వర్షాల కారణంగా పాఠశాల, కళాశాలలకు సెలవులు ప్రకటించారు.

పాఠశాలల మూసివేత:

ఈ పరిస్థితుల కారణంగా జిల్లా అధికారులు పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. శ్రీ సత్యసాయి జిల్లాకు అక్టోబర్ 15 నుంచి 17 వరకు, చిత్తూరు జిల్లాలో అక్టోబర్ 15 నుంచి 16 వరకు, అనంతపురం జిల్లాకు అక్టోబర్ 17, 18 తేదీల్లో సెలవులు ప్రకటించారు. అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారి ఉత్తర దిశగా కదులుతుందని, రానున్న 48 గంటల్లో తమిళనాడు, దక్షిణ కోస్తా ప్రాంతాలపై ప్రభావం చూపుతుందని అంచనా. ఈరోజు, రేపు దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

తీరం వెంబడి గంటకు 35-55 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఒడ్డుకు చేరుకోవాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా ఎలాంటి నష్టం జరుగకుండా ఆయా జిల్లాల అధికారుల అప్రమత్తం చేసింది ప్రభుత్వం. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ అందిస్తూనే ఉంది.