విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. చాలా మంది విద్యార్థులు పాఠశాలకు వెళ్లి వచ్చి సాయంత్రం ఆడుకోవడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు.
ఈ క్రమంలో ఒంటిపూట బడులు ఎప్పుడు ప్రారంభం అవుతాయో అని ఎదురు చూస్తుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా ఒంటిపూట బడుల పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ ఏడాది వేసవి కంటే ముందుగానే ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రత దృష్ట్యా ఒంటిపూట బడులపై ఏపీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
మార్చిలో రావాల్సిన వేడి ఇప్పుడే వచ్చేస్తుంది. ఉదయం 10 గంటలు దాటితే చాలు ఎండ మండి పోతుంది. దీంతో పిల్లలు స్కూల్‌కి వెళ్లి సాయంత్రం వరకు ఉండాలి అంటే అలసిపోతున్నారు. ఈ క్రమంలో ఒంటిపూట బడుల నిర్వహణ పై ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. అయితే గత ఏడాది వేసవి కాలానికి సంబంధించి ఒంటిపూట బడులను ముందుగానే గత ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే విషయంపైన ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మార్చి 15 కంటే ముందు నుంచే ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.