సామాన్యులకు గుడ్ న్యూస్: దీపావళికి ముందు చౌకగా టీవీ, ఏసీలు.. ఎంత తగ్గుతాయో తెలుసుకోండి

దీపావళి పండుగకు ముందు భారతీ ప్రభుత్వ జీఎస్టీ కౌన్సిల్ ప్రజలకు పెద్ద శుభవార్త అందించింది. జీఎస్టీ రేట్లలో భారీ మార్పులు చేయడంతో ఏసీలు, టీవీలు, డిష్‌వాషర్ల వంటి ఎలక్ట్రానిక్ వస్తువల ధరలు గణనీయంగా తగ్గుతాయి.


ఈ కొత్త రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి వస్తాయి. అదే రోజున నవరాత్రి ఉత్సవాలు కూడా ప్రారంభమవుతాయి.

8-9 శాతం తగ్గిన ధరలు

కొత్త జీఎస్టీ సంస్కరణల ప్రకారం.. అనేక ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. ఈ కీలక మార్పు వల్ల టీవీలు, ఏసీలు, డిష్ వాషర్ల ధరలు 8 శాతం నుంచి 9 శాతం వరకు తగ్గుతాయి.

రూ.23 వేల వరకు టీవీపై తగ్గింపు

ఇండస్ట్రీ వర్గాల నివేదికల ప్రకారం.. ఈ పన్ను తగ్గింపు వల్ల 43 అంగుళాల టీవీ ధర దాదాపు రూ. 2 వేల వరకు తగ్గుతుంది. అదేవిధంగా.. 75 అంగుళాల టీవీ ధర రూ.23 వేల వరకు తగ్గవచ్చని అంచనా. ఇక ఏసీలు, డిష్ వాషర్ల విషయానికి వస్తే.. వాటి ధరలు రూ. 3,500 నుంచి రూ.4,500 వరకు తగ్గనున్నాయి.

ఇంతకు ముందు ఎప్పుడూ ఇంత తగ్గింపు లేదు..

హైయర్ ఇండియా అధ్యక్షుడు ఎన్ఎస్. సతీష్ ఈ సంచలన నిర్ణయంపై మాట్లాడుతూ.. ఎలక్ట్రానికి ఉత్పత్తులపై పన్నులు ఇంత భారీగా తగ్గించడం ఇదే మొదటిసారి అంటూ వెల్లడించారు. దాదాపు 8 శాతం ధర తగ్గడం వల్ల ఈ వస్తువుల వినియోగం విపరీతంగా పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే కొత్త రేట్లు అమలులోకి వచ్చే సెప్టెంబర్ 22 వరకు ప్రజలు కొనుగోళ్లు వాయిదా వేసుకునే అవకాశం ఉన్నందున, తాత్కాలికంగా అమ్మకాలపై ప్రభావం పడుతుందని.. కానీ తర్వాత పెరిగే డిమాండ్‌తో ఇది సర్దుబాటు అవుతుందని ఆయన వివరించారు.

కొత్త జీఎస్టీ రేట్లు ఇలా..

*ఎయిర్ కండిషనర్ -28 నుంచి 18 శాతం

*డిష్‌వాషర్ – 28 నుంచి 18 శాతం

*టీవీ – 28 నుంచి 18 శాతం

*మానిటర్ – 28 నుంచి 18 శాతం

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.