దివ్యాంగులకు శుభవార్త.. ఆ సమస్యకు పరిష్కారంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయం

తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ దివ్యాంగుల వివాహ ప్రోత్సాహ పథకం కేవలం ఒకరు దివ్యాంగులుగా ఉన్న జంటలకే వర్తించేది. అయితే, ఈ పథకం పరిమితిని విస్తరించేందుకు ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు.


ఇక తాజా నిర్ణయం ప్రకారం, ఇకపై ఇద్దరు దివ్యాంగులు ఒకరినొకరు వివాహం చేసుకున్నా వారికి కూడా ప్రభుత్వం లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించనుంది. ఇప్పటి వరకూ ఒకరు దివ్యాంగుడు లేదా దివ్యాంగురాలు కాగా, మరొకరు సాధారణ వ్యక్తి అయినప్పుడే ఈ పథకం వర్తించేది. అయితే, ఇద్దరూ దివ్యాంగులు అయినప్పుడు ఈ పథకం వర్తించకపోవడంతో చాలామంది అసంతృప్తిని వ్యక్తం చేసేవారు. ఇప్పుడు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపుతూ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. ఈ ప్రోత్సాహ పథకం అమలు వల్ల మరిన్ని దివ్యాంగుల పెళ్లిళ్లకు మార్గం సుగమం కానుంది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.