రైతులకు శుభవార్త..ఈ ఏడాది వర్షాలే వర్షాలు కారణమేమిటంటే.!

దేశంలో వ్యవసాయం చేసే అన్నదాతలకు నైరుతి రుతుపవనలే పెద్ద దిక్కు. ఈ రుతుపవనల మీదే 70 శాతం అందరూ అధారపడి ఉంటారు. కానీ, వీటిని నమ్ముకుంటున్నా అన్నదాతల పరిస్థితి అయితే అతివృష్టి లేదా అనవృష్టి లా మారింది.
ఎందుకంటే.. గతేడడాది ఈ నైరుతి రుతుపవనలు అన్నదాతలకు తీవ్ర నిరాశకు గురిచేసింది. ముఖ్యంగా ఫసిపిక్ మహా సముద్రంలో ఏర్పడిన ఎల్ నినో అనేది గట్టిగానే దెబ్బ కొట్టింది. దీంతో దేశంలో అతి తక్కువ వర్షపాతంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. సకాలంలో రుతుపవనాలు రాకపోవడంతో వర్షాలు కురవలేదు. దీంతో పంటలను సాగుచేసుకోలేక అన్నదాతలు బాధపడ్డారు. ఇక మరికొన్ని ప్రాంతల్లో అయితే అకాల వర్షాలు అనేవి రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది మాత్రం అన్నదాతలకు అలాంటి ఇబ్బందులు ఉండవని వాతావరణశాఖ చక్కని శుభవార్త చెప్పింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..
దేశానికి అన్నం పెట్టే అన్నదాతలకు ఈ ఏడాది వ్యవసాయ రంగంలో అని అనుకూల పరిస్థితులు ఉన్నాయని వాతవరణశాఖ తెలిపింది. ముఖ్యంగా జూన్‌లో రానున్న నైరుతి రుతుపవనాలు అనేవి అన్నదాతల కళ్లల్లో ఆనందాన్ని నింపుతాయని ఐఎండీ అంచనా వేస్తోంది. ఈ క్రమంలోనే.. వచ్చే జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య దేశంలో వర్షాలు పుష్కలంగా కురుస్తాయని పేర్కొంది. ఇక గతడేది పడిన వర్షపాతం కంటే కూడా ఈ ఏడాది మెరుగ్గా ఉంటాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే.. పసిఫిక్ మహాసముద్రంలో కొనసాగుతున్న ఎల్ నినో అనేది ప్రస్తుతం బలహీనపడిందని, అలాగే జూన్ నాటికి పూర్తి స్థాయిలో ఇది బలహీనపడుతుందని అమెరికా, ఐరోపా వాతావరణ సంస్థలు అంచనా వేశాయి. దీంతో నైరుతి రుతుపవనాలు మొదలయ్యే సమయానికి లానినా పరిస్థితులు ఏర్పడే ఆవకాశం ఉందని ఈ సంస్థలు చేపట్టిన అధ్యయనంలో వెల్లడయ్యింది.
ఇక ఎల్ నినో ఇలాగే కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావం ఉంటుందని.. దీనివల్ల అధిక ఉష్ణోగ్రతలతో పాటు అతి తక్కువ వర్షపాతం నమోదవుతోంది. దీనివలన కొన్నిచోట్ల అనుకోని విపత్తులు ఉంటాయని నిపుణులు పేర్కొన్నారు. ముఖ్యంగా భారత ఉపఖండంపై ఈ ఎల్ నీనో ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. కానీ, ప్రస్తుత పరిస్థితులను గమనిస్తుంటే.. ఏప్రిల్ నుంచి ఎల్ నినో బలహీనపడి ఆగష్టు నాటికి లానినా బలపడుతుందని భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి మాధవన్ రాజీవన్ తెలిపారు. గతేడాది నైరుతి రుతుపవనాల కాలంలో సాధారణ వర్షపాతం (868.6 మిల్లీమీటర్లు) కంటే తక్కువగా (820 మి..మీ) నమోదైందని, ఈసారి అంతకంటే మెరుగ్గా వర్షాలు ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అలాగే వర్షాలకు లోటులేకపోయినా.. వేసవిలో మాత్రం ఎండలు దంచికొడతాయని అంటున్నారు. గత వేసవి కంటే ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ప్రపంచ వాతావరణ సంస్థ పేర్కొంది. నైరుతి సకాలంలో వచ్చి మంచి వర్షాలు పడిన వేసవి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీంతో తుఫాన్ల తీవ్రత అనేది కుంభవృష్టి గా మారే ఆవకావం ఉందని జాతీయ, అంతర్జాతీయ వాతావరణ నిపుణులు అంటున్నారు. మరి, ఈ ఏడాది ప్రవేశించిన రుతుపవనాలు అనేవి అన్నదాతలకు అనుకూలంగా ఉంటయనే ఐఎండీ అంచనాల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

Related News