ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గుడ్ న్యూస్ చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది మాత్రమే ఇంటింటికీ వచ్చి రేషన్ కార్డులు ఇస్తారని తెలిపారు.
అక్టోబర్ 31 వరకు కార్డులో మార్పులు, చేర్పులు ఉంటే చేయించుకోవచ్చని నాదెండ్ల మనోహర్ ప్రజలకు సూచించారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీ విషయంలో ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని తెలిపారు.
వచ్చే వారం నుంచి ఆన్ లైన్ లో…వచ్చే వారం నుంచి మనమిత్ర వాట్సాప్ యాప్ లో కూడా కార్డులు అందుబాటులో ఉంటాయని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అప్పుడు రేషన్ కార్డులకు సంబంధించి ఆన్ లైన్ లో కూడా కరెక్షన్ చేసుకునే అవకాశముంటుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందుతాయని తెలిపారు.
































