ఏపీ పేదలకు శుభవార్త.. ఉపాధి హామీ కూలీ రేటు పెంపు

www.mannamweb.com


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పేద ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు నాయుడు సర్కార్. ఉపాధి హామీ పథకం పై కీలక ప్రకటన చేసింది చంద్రబాబు నాయుడు సర్కార్.

ఉపాధి హామీ పథకం కూలి ధరలను పెంచేందుకు రంగం సిద్ధం చేసింది చంద్రబాబు నాయుడు సర్కార్. ఉపాధి హామీ పథకం కూలీలకు రోజుకు 300 రూపాయలు వచ్చేలా.. చంద్రబాబు నాయుడు కూటమి సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి

ఇప్పటి వరకు 255 రూపాయలు రోజుకు వచ్చేవి. అయితే 255 రూపాయల కూలీని.. 300 రూపాయల వరకు పెంచేందుకు చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్…ప్రణాళికలు రూపొందిస్తున్నారట. పనులు ఎలా చేపడితే 300 రూపాయల కూలి వస్తుందో..ఆ విధంగా చర్యలు తీసుకోనున్నారట. కూలీలు మెట్లు ఫీల్డ్ అసిస్టెంట్లకు ఇప్పటికే దీనిపై అవగాహన కూడా కల్పించేందుకు రంగం సిద్ధం చేసింది చంద్రబాబు ప్రభుత్వం.Good news for the poor of AP